Isha: గ్రామీణ స్ఫూర్తిని రగిలించే సాధనంగా ఇషా గ్రామోత్సవం: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్

By Mahesh K  |  First Published Sep 24, 2023, 4:01 PM IST

ఇషా గ్రామోత్సం కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. కోయంబత్తూర్ ఆదియోగి వద్ద జరిగిన గ్రాండ్ ఫినాలేకు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ హాజరయ్యారు. గ్రామీణ స్ఫూర్తిని రగిలించే సాధనంగా ఇషా గ్రామోత్సవం మారడం సంతోషదాయకమని ఆయన అన్నారు.
 


కోయంబత్తూర్: గ్రామీణ స్ఫూర్తి రగిల్చే సమర్థవంతమైన సాధనంగా ఇషా గ్రామోత్సం మారిందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ శనివారం అన్నారు. సమాజంలోని కులాల అడ్డుగోడలను బద్ధలు కొట్టి మహిళా సాధికారత, గ్రామీణ స్ఫూర్తిని ఇషా గ్రామోత్సవం కలిగిస్తున్నదని వివరించారు. ఇషా గ్రామోత్సవం ఈ వైపుగా సామాజిక పరివర్తనకు దోహదపడుతున్నదని తెలిపారు. కోయంబత్తూర్‌లో శనివారం ఇషా గ్రామోత్సవం గ్రాండ్ ఫినాలే జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్రమంత్రి పై వ్యాఖ్యలు చేశారు.

దక్షిణాది రాష్ట్రాలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి వ్యాప్తంగా ఆగస్టులో ఈ క్రీడా కార్యక్రమాలు మొదలయ్యాయి. 194 గ్రామీణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. మొత్తం 60 వేల మంది క్రీడాకారులు ఇందులో పాల్గొన్నారు. ఇందులో 10 వేల మంది మహిళా క్రీడాకారులు కూడా ఉన్నారు.

Thrilled to attend the Gramotsavam programme at in the divine company of ji. It was truly a mesmerizing experience witnessing the electrifying atmosphere and the enthusiasm of the participants. I was glad to hear that more than 60,000 players have… pic.twitter.com/jqADwUwYdV

— Anurag Thakur (@ianuragthakur)

Latest Videos

Also Read: 

2004లో సద్గురు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజల జీవితాల్లో క్రీడా, క్రీడా స్ఫూర్తిని తెచ్చే ఉద్దేశ్యంతో సద్గురు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామీణ క్రీడలు, సంస్కృతి వంటివాటిని మరెక్కడా చూడలేని రీతిలో ఈ కార్యక్రమం చూపెట్టిందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వివరించారు. గ్రామీణులకు ఆరోగ్యం, సంపద, శ్రేయస్సును తేవాలనే లక్ష్యంతో ఇషా గ్రామోత్సవం కార్యక్రమాన్ని సద్గురు 2004లో ప్రారంభించారు. ఇక్కడికి వచ్చిన కార్మికులు, రైతులు, మత్స్యకారుల్లో తాను కేవలం క్రీడాకారులను మాత్రమే చూడగలిగానని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌తోపాటు ఇషా వ్యవస్థాపకుడు సద్గురు, నటుడు సంతానం, భారత హాకీ టీమ్ మాజీ కెప్టెన్ ధనరాజ్ పిళ్లై హాజరయ్యారు.

click me!