ప్రధాని వెనుక స్పీకర్ కూర్చోవడం అన్‌పార్లమెంటరీ కాదా ? - కేంద్రాన్ని ప్ర‌శ్నించిన అసదుద్దీన్ ఒవైసీ

Published : Jul 14, 2022, 04:25 PM IST
ప్రధాని వెనుక స్పీకర్ కూర్చోవడం అన్‌పార్లమెంటరీ కాదా ? - కేంద్రాన్ని ప్ర‌శ్నించిన అసదుద్దీన్ ఒవైసీ

సారాంశం

జాతీయ చిహ్నం ఆవిష్కరించే సమయంలో ప్రధాని వెనకాల స్పీకర్ కూర్చోవడం అన్ పార్లమెంటరీ కిందకు రాదా అని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. సభలో మాట్లాడే సందర్భం ముఖ్యమని కేంద్రానికి సూచించారు.   

ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ గురువారం మరోసారి కేంద్ర ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. జాతీయ చిహ్నం, పార్లమెంటు వర్షాకాల సమావేశంలో నిషేధించిన ప‌దాలను రూపొందిస్తూ లోక్ స‌భ సెక్రటేరియ‌ట్ విడుదల చేసిన బుక్ లెట్ పై కూడా ఆయ‌న ప్ర‌శ్న‌లు సంధించారు. ‘‘ మీరు పార్లమెంటులో మాట్లాడే విషయాల్లో సందర్భం ముఖ్యం. మీరు కేవలం పదాలను అన్‌పార్లమెంటరీ పదాలు అని చెప్పలేరు. కాంస్య జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించే సమయంలో ప్రధాని వెనుక స్పీకర్ కూర్చోవడం అన్‌పార్లమెంటరీ కాదా? ’’ అని ఆయన అన్నారు. 

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ నజర్.. బెంగళూరులో ఆరెస్సెస్ నాయ‌కుల‌తో భేటీ !

జుమ్లజీవి, బాల్ బుద్ధి, కోవిడ్ వ్యాప్తి, సిగ్గు, దుర్వినియోగం, ద్రోహం'వంటి నిర్దిష్ట పదాలను అన్‌పార్లమెంటరీగా వర్గీకరించిన బుక్ లెట్ విడుదల నేపథ్యంలో ఈ మాట‌ల యుద్ధం ప్రారంభ‌మైంది. టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్, కాంగ్రెస్‌కు చెందిన అభిషేక్ మను సింఘ్వీ, జైరామ్ రమేష్ వంటి పలువురు ప్రతిపక్ష ఎంపీలు కూడా ఈ చర్యను తప్పుబట్టారు. గాగ్ ఆర్డర్ వెనుక ఉన్న తర్కాన్ని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం కోసం పోరాడే ప్రయత్నంలో పదాలను ఉపయోగించడం కొనసాగిస్తానని ఓబ్రియన్ చెప్పారు.  శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది ఈ విష‌యాన్ని ప్రస్తావిస్తూ మోడీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ మేర‌కు ఆమె ట్విట్ట‌ర్ లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ చేస్తే ఏం చేయాలి, చెబితే ఏం చెప్పాలి? ఓన్లీ, వావ్ మోడీ జీ వావ్! ఈ జనాదరణ పొందిన జ్ఞాపకం ఇప్పుడు నిజమనిపిస్తోంది’’ అని ఆమె ట్వీట్ చేశారు. 

ఇదిలా వుండగా సభా పద్ధతికి అనుగుణంగా లేని మాటలు మాట్లాడినట్లయితే పార్లమెంటులో అయినా, అసెంబ్లీలో అయినా దానిని తొలగించే అధికారం స్పీక‌ర్ దేన‌ని లోక్‌సభ సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి. అయితే తాజా ఉత్త‌ర్వుల ప్ర‌కారం.. ఇకపై నుంచి పార్లమెంట్‌లోని ఉభ‌య‌స‌భ‌ల్లో స‌భ్యులు ఇష్టానుసారంగా మాట్లాడానికి వీల్లేదు. అభ్యంతరకర పదాలు వాడితే.. వారిపై చర్యలు తప్పవు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్‌ ఒక బుక్‌లెట్ చేస్తూ పార్ల‌మెంట్ లో అన్‌పార్లమెంటరీ పదాలు వాడొద్దని స‌భ్యులకు తెలిపారు. ఈ జాబితాలో చేర్చిన ప‌దాల‌ను ‘అన్‌పార్లమెంటరీ ఎక్స్‌ప్రెషన్’ వర్గంలో ఉంచుతారు. చర్చల సందర్భంగా ఉభయ సభల్లో.. జుమ్లాజీవి, కరోనా వ్యాప్తి, జైచంద్, శకుని, జైచంద్, లాలీపాప్, చందల్ క్వార్టెట్, గుల్ ఖిలాయే, పిట్టు, అరాచకవాది, వినాశ్‌పురుష్, ఖలిస్థానీ, చీటర్, నికమ్మా, బేహ్రీ సర్కార్, కాలా బజారీ, దలాల్, దాదాగిరీ, బేచారా, బాబ్‌కట్, లాలీపాప్, విశ్వాస్‌ఘాత్, సంవేదన్‌హీన్, బ్లడ్‌షెడ్, డాంకీ వంటి పదాలను ఉపయోగించ కూడదు. ఒక వేళ ఉప‌యోగిస్తే స్పీక‌ర్ త‌న విచ‌క్ష‌ణా అధికారంతో స‌భ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటారు. 

PREV
click me!

Recommended Stories

Makarajyothi: ఘనంగా మకర జ్యోతి ఉత్సవం.. దర్శనానికి పోటెత్తిన లక్షలాది స్వాములు | Asianet News Telugu
Petrol Price : లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.200... ఎక్కడో కాదు ఇండియాలోనే..!