కోడి జంతువేనా?.. గుజరాత్ హైకోర్టులో ‘చిక్కు సమస్య’.. త్వరగా తేల్చాలని పౌల్ట్రీ ట్రేడర్లు విజ్ఞప్తి

By Mahesh KFirst Published Mar 30, 2023, 6:02 PM IST
Highlights

కోడి జంతువేనా? అనే అంశంపై గుజరాత్ హైకోర్టు వాదనలు వింటున్నది. బుధవారం ఈ వాదనలు విన్నా.. ఇంకా నిర్దారణ జరగలేదు. కోళ్లను చికెన్ షాపులో వధించవద్దని రెండు ఎన్జీవోలు గుజరాత్ హైకోర్టులో పిటిషన్లు వేశాయి. ఆ తర్వాత కొన్ని నగర పాలక సంస్థలు మీట్ షాపులు, చికెన్ షాపులు మూసేయాలని ఆదేశాలు జారీ చేశాయి. దీంతో పౌల్ట్రీ ట్రేడర్లు, చికెన్ షాపు ఓనర్లు హైకోర్టును ఆశ్రయించాయి.
 

అహ్మదాబాద్: కోడి ముందా? గుడ్డు ముందా? అనే చిక్కు ప్రశ్నకు కాలం చెల్లింది. దీనికి ఇప్పుడు కొత్త ప్రశ్నగా కోడి జంతువేనా? అనే ప్రశ్న ముందుకు వచ్చింది. ఈ చిక్కు ప్రశ్నను గుజరాత్ హైకోర్టు తేల్చాల్సి ఉన్నది. గుజరాత్ హైకోర్టు కూడా ఈ ప్రశ్నకు సమాధానాన్ని వెతకడంలో దీర్ఘాలోచనలు చేస్తున్నది. త్వరగా తేల్చి చెప్పాలని పౌల్ట్రీఫామ్, చికెన్ షాపు ఓనర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. 

కోళ్లను చికెన్ షాపులో కాకుండా వధశాలల్లో వధించేలా ఆదేశాలు వెలువరించాలని పిటిషన్లు గుజరాత్ హైకోర్టులో దాఖలయ్యాయి. శుభ్రతా ప్రమాణాలు పాటించడం లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని పేర్కొంటూ మీట్, పౌల్ట్రీ షాపులను క్లోజ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో తమ పిటిషన్ విచారించి షాపులు తెరిచేలా ఆదేశాలు ఇవ్వాలని పౌల్ట్రీ ట్రేడర్లు, చికెన్ షాపు ఓనర్లు హైకోర్టును ఆశ్రయించారు.

సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ సహా కొన్ని సివిక్ బాడీలు దుకాణాలను మూసేయాలని ఆదేశించాయి. జంతువులను వధశాలలోనే వధించాలని, షాపుల్లో వధించవద్దని ఆ సివిక్ బాడీలు పేర్కొన్నాయి.

Also Read: ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులు.. మాస్క్ తప్పనిసరి ఆదేశాలు, రేపు సీఎం కేజ్రీవాల్ సమీక్షా సమావేశం

యానిమల్ వెల్ఫేర్ ఫౌండేషన్, అహింసా మహా సంఘ్ రెండు ఎన్జీవోలు రెండు పిటిషన్లు ఫైల్ చేశాయి. రూల్స్ కఠినంగా అమలయ్యేలా ఆదేశించాలని కోరాయి. చికెన్ షాపుల్లో కోళ్లు కోయకుండా ఆదేశించాలని కోరాయి. ఈ పిటిషన్ల తర్వాతే కొన్ని సివిక్ బాడీలు పై ఆదేశాలు పంపాయి. షాపులూ మూసేయాలని సివిక్ బాడీలు ఆదేశించడంతో పౌల్ట్రీ ట్రేడర్లు, చికెన్ షాపు ఓనర్లు హైకోర్టును ఆశ్రయించాయి. కోళ్లు జంతువులు కావని, కాబట్టి, చికెన్ షాపులు మూసేయాలనే ఆదేశాలను ఎత్తేయాలని కోరాయి. ఇంతకీ కోళ్లు జంతువులేనా? అనే ప్రశ్నపైనే బుధవారం కూడా గుజరాత్ హైకోర్టులో విచారణ జరిగింది. ఇంకా నిర్దారణ జరగలేదు.

click me!