తుపాకీతో కాల్చుకొని ఐపీఎస్ అధికారి ఆత్మహత్య

Published : Aug 14, 2019, 10:21 AM IST
తుపాకీతో కాల్చుకొని ఐపీఎస్ అధికారి ఆత్మహత్య

సారాంశం

ఫరీదాబాద్ నగర డీసీపీగా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి విక్రంకపూర్ బుధవారం ఉదయం తన సర్వీసు రివాల్వరుతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఓ ఐపీఎస్ అధికారి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన  హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్ లో చోటుచేసుకుంది. ఫరీదాబాద్ నగర డీసీపీగా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి విక్రంకపూర్ బుధవారం ఉదయం తన సర్వీసు రివాల్వరుతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

 ఈ ఘటన ఫరీదాబాద్ పోలీసులైన్స్ లోని సెక్టార్ 30లోని నివాసగృహంలో బుధవారం ఉదయం ఆరు గంటలకు జరిగింది. డీసీపీ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. ఫరీదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఆయన ఏదో విషయంలో బాగా మదనపడుతున్నారని కుటుంబసభ్యులు చెబుతున్నారు.  ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతేడాదే ఆయనకు ప్రమోషన్ కూడా వచ్చినట్లు అధికారులు  చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu