తండ్రి శవానికి ఐపీఎస్ అధికారి చికిత్స.. ప్రశ్నించిన హెచ్ఆర్సీ

By ramya NFirst Published Feb 20, 2019, 12:22 PM IST
Highlights

తండ్రి శవానికి ఓ ఐపీఎస్ అధికారి ఆయుర్వేద చికిత్స చేయించిన సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై తక్షణమే వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ డీజీపీని ఆదేశించింది.
 

తండ్రి శవానికి ఓ ఐపీఎస్ అధికారి ఆయుర్వేద చికిత్స చేయించిన సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై తక్షణమే వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ డీజీపీని ఆదేశించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ ‌‌క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి రాజేంద్ర కుమార్ మిశ్రా తండ్రి కేఎం మిశ్రా గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు.

జనవరి 13న ఆయన్ను భోపాల్ లోని బన్సాల్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ కేఎం మిశ్రా జనవరరి 14 సాయంత్రం మరణించారు. దీంతో తండ్రి మృతదేహాన్ని రాజేంద్ర కుమార్ తన అధికారిక నివాసానికి తీసుకెళ్లారు. అక్కడే తన తండ్రి భౌతిక కాయానికి ఆయుర్వేద చికిత్స చేయిస్తున్నారు.  

ఆ ప్రాంతంలో రాష్ట్రమంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్‌ల అధికారిక నివాసాలు ఉన్నాయి. నెల రోజులుగా ఆయన ఇలాగే చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల రాజేంద్రకుమార్ నివాసం వద్ద ప్రత్యేక ఆర్మీ బలగాలకు చెందిన సిబ్బంది విధులు నిర్వహించడానికి వచ్చారు.

మృతదేహానికి ఆయుర్వేద చికిత్స గురించి తెలుసుకోవడంతో అది మీడియాకు చేరింది. దీనిపై మీడియా ప్రతినిధులు రాజేంద్రకుమార్‌ను ప్రశ్నించగా... తన తండ్రి చనిపోలేదని, చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు.

తన తండ్రి పరిస్థితిపై ఆస్పత్రి ఇచ్చిన నివేదికపై తాను స్పందించనన్నారు. దీంతో ఆయన తండ్రిని చూపించాల్సిందిగా మీడియా కోరింది. అయితే అందుకు రాజేంద్ర కుమార్ అంగీకరించలేదు. 

కాగా.. ఈ ఘటన మీడియాలో విపరీతంగా ప్రసారం కాగా.. మానవ హక్కుల కమిషన్ స్పందించింది. వ్యవహారంపై తేల్చాల్సిందిగా.. డీజీపీని ఆదేశించింది.

click me!