చిదంబరంపై లుక్‌అవుట్ నోటీసులు... ఏ క్షణమైనా అరెస్ట్

By Siva KodatiFirst Published Aug 21, 2019, 1:06 PM IST
Highlights

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. 

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ కుంభకోణం మొత్తానికి చిదంబరం సూత్రధారిగా ఉన్నట్లు అర్ధమవుతుందని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది.

దీంతో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో చిదంబరాన్ని కస్టడీలోకి తీసుకోవాలని సీబీఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో తాత్కాలిక ఉపశమనం కోరుతూ సుప్రీంను ఆశ్రయించిన చిదంబరానికి అక్కడా నిరాశే ఎదురైంది.

ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ రంజాన్ గొగొయ్ ధర్మాసనానికి పంపినట్లు జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు.  

అయితే సీజేఐ అయోధ్య కేసులో రోజువారీ విచారణను ప్రారంభించడంతో చిదంబరం న్యాయవాది కపిల్ సిబల్ అత్యవసర విచారణ పిటిషన్ దాఖలు చేయలేకపోయారు. దీంతో ఆయనను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం వుంది. 

సీజేఐ వద్దకు బెయిల్ పిటిషన్, మధ్యాహ్నం తేలనున్న చిదంబరం భవితవ్యం

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: అజ్ఞాతంలోకి చిదంబరం, గాలిస్తున్న సీబీఐ

click me!