కరెన్సీ నోట్లతో కరోనా... ఇదో కొత్త రకం టెన్షన్

By telugu news team  |  First Published Mar 21, 2020, 11:23 AM IST

ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చేతిలో కరెన్సీ లేనిది పని జరగదు. అలాంటి సమయంలో.. ఇప్పుడు కరెన్సీ నోట్లు పట్టుకుంటే కరోనా వస్తుంది అనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. 


కరోనా వైరస్ పేరు చెబితేనే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. కరోనా రాకుండా ఉండేందుకు ఎరికి వాళ్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తోటివారికి ఎవరికీ కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడం లేదు. ఈ జాగ్రత్తలన్నీ బాగున్నాయి.కానీ... కరెన్సీ రూపంలో కూడా కరోనా వ్యాప్తి చెందుతున్న విషయం ఇప్పుడు మరింత కంగారు పెడుతోంది.

ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చేతిలో కరెన్సీ లేనిది పని జరగదు. అలాంటి సమయంలో.. ఇప్పుడు కరెన్సీ నోట్లు పట్టుకుంటే కరోనా వస్తుంది అనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఈమేరకు కాన్ ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఆర్థిక శాఖను హెచ్చరిస్తోంది.

Latest Videos

ఇప్పుడిప్పుడే ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ విస్తరిస్తున్నప్పటికీ అది కేవలం 3 శాతానికి పరిమితం. ఈ క్రమంలో 97 శాతం నగదు చేతుల మీదే లెక్కిస్తున్నారు. వీటిని లెక్కించే క్రమంలో ఒక వేళ కరోనా సోకిన వ్యక్తి ఒకసారి నోట్ల తడి చేసి నోట్లను లెక్కిస్తే.. ఆ వైరస్‌ నోట్లకూ పాకుతుంది.. అయితే ఆ వైరస్.. కరెన్సీ నోట్లపై ఎన్ని గంటలు ఉంటుంది అనేది ఇప్పటి వరకు అధ్యయనం జరగలేదు.  

ఒక నోటు పొరపాటున కరోనా వైరస్‌ వ్యక్తి నుంచి ఉదయం బయటకు వస్తే అది సాయంత్రానికి ఎంత మందికైనా మారవచ్చు. వీరందరి చేతికి వైరస్‌ చేరినట్లే. పొరపాటున అదే జరిగితే జరిగే నష్టం ఊహకు కూడా అందడం లేదు. అందువలన కరెన్సీ సాధ్యమైనంత వరకు నోటితో తడి చేయకుండానే లెక్కించండి. వీలైనంత వరకు ఫోన్‌పే, గూగుల్‌పే వంటి వాటిని వాడండి.

ఏటీఎంలలో కొత్త నోట్లు అంటుకు పోయి వస్తాయి... వాటిని విడదీసే సమయంలో నోట్ల ఉన్న తేమ సహాయం వద్దు. ఇప్పటి వరకు ఈ కోణంలో ప్రపంచంలో ఎక్కడా కరోనా ప్రమాదం ముంచి ఉందని ప్రచారం జరగటం లేదు. సీఏఐటీ చేసిన హెచ్చరికతో ఇది వెలుగులోకి వచ్చింది.

click me!