ఇండియాలో 258కి చేరుకున్న కరోనా కేసులు: రాష్ట్రాలవారీగా లెక్కలు ఇవీ...

By telugu teamFirst Published Mar 21, 2020, 10:42 AM IST
Highlights

భారతదేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య 258కి చేరుకుంది. మహారాష్ట్రలో అత్యధికంగా 52 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానం కేరళ ఆక్రమించింది. కేరళలో 40 కేసులు నమోదయ్యాయి.

న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. దేశంలో 258 కేసులు రికార్డయ్యాయి. మహారాష్ట్ర ఎక్కువగా కరోనావైరస్ వ్యాప్తికి గురైనట్లుకనిపిస్తోంది. ఆ తర్వాత స్థానం కేరళ ఆక్రమిస్తోంది. విదేశాల నుంచి ముంబైకి ఎక్కువ మంది ప్రయాణికులు వచ్చే అవకాశం ఉండడం వల్ల కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు భావించవచ్చు. గల్ఫ్ నుంచి కేరళకు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. దీంతో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు భావించవచ్చు.

మహారాష్ట్రలో 52 కేసులు నమోదు కాగా, కేరళలో 40 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రాలవారీగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది. హిమాచల్ లో మొదటి కరోనా కేసు నమోదైంది. మధ్యప్రదేశ్, గుజరాత్ ల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి.

మహారాష్ట్ర 52
హర్యానా 17
ఉత్తరప్రదేశ్ 24
రాజస్థాన్  17
లడక్ 13
పంజాబ్ 2
గుజరాత్ 7
పుద్దేచ్చేరి 1
మధ్యప్రదేశ్  4
చండీ ఘడ్ 1
పుదుచ్చేరి 1
తమిళనాడు 3
ఢిల్లీ 26
జమ్మూ కాశ్మీర్ 4
ఉత్తరాఖండ్ 3
ఒడిశా 2
పశ్చిమ బెంగాల్ 3
కేరళ 40
తెలంగాణ 19
కర్ణాటక 15 
ఆంధ్రప్రదేశ్ 3

ఇప్పటి వరకు కరోనావైరస్ బారి నుంచి 23 మంది కోలుకున్నారు. రేపు ఆదివారం జనతా కర్ప్యూ ప్రకటించారు. దీంతో ఈ రోజు ఆర్థరాత్రి నుంచి 3500 రైళ్లను రద్దు చేస్తున్నారు. ఈ నెల 31వ తేదీ వరకు బాలీవుడ్ షూటింగ్ లను రద్దు చేశారు. 

click me!