ఢిల్లీలో టెన్షన్: అమిత్ షా ఆరా, ఇంటర్నెట్ సేవలు బంద్

By narsimha lodeFirst Published Jan 26, 2021, 5:12 PM IST
Highlights

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ  రైతులు నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. పలు చోట్ల రైతులపై  పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.


న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ  రైతులు నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. పలు చోట్ల రైతులపై  పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాఠీచార్జీ చేశారు. ర్యాలీలో పాల్గొన్న రైతు  ట్రాక్టర్ కింద పడి మరణించాడు. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా  ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులపై అమిత్ షా ఉన్నతాధికారుల నుండి సమాచారాన్ని తెలుసుకొన్నారు. రైతుల ర్యాలీలో ఏం జరిగిందనే విషయమై  అధికారులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించారు.ఢిల్లీలో హింసాత్మక ఘటనలకు తాము కారణం కాదని రైతు సంఘాల నేతలు ప్రకటించారు. ర్యాలీలో కొందరు  ఆగంతకులు ర్యాలీలో చొరబడ్డారని రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు.

ఈ హింస నేపథ్యంలో మెట్రో రైల్వేస్టేషన్లను మూసివేశారు. మరో వైపు ఇంటర్నెట్ సేవలను కూడ నిలిపివేశారు. రాత్రి 12 గంటల వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది.శాంతి భద్రతల దృష్ట్యా సింఘి, టిక్రీ, ఘాజీపూర్, ముఖర్ధాచౌక్, నగ్లోయ్ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సవేలను నిలిపివేస్తున్నట్టుగా కేంద్రం ప్రకటించింది.
 

click me!