అంతర్జాతీయ విమానాలపై నిషేధం జూన్ 30 వరకు పొడిగింపు

Published : May 28, 2021, 03:30 PM IST
అంతర్జాతీయ విమానాలపై నిషేధం జూన్ 30 వరకు పొడిగింపు

సారాంశం

ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఇండియా నిషేధాన్ని పొడిగించింది. ఈ మేరకు డీజీసీఏ శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.  

న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఇండియా నిషేధాన్ని పొడిగించింది. ఈ మేరకు డీజీసీఏ శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.కార్గో విమానాలతో పాటు ప్రత్యేకంగా అనుమతి పొందిన విమానాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేవని  డీజీసీఏ ప్రకటించింది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం ఈ నెలాఖరు వరకు నిషేధం ఉంది. దేశంలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలో  అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని పొడిగించింది కేంద్రం. 

గత ఏడాది మార్చి 31వ తేదీ నుండి   అంతర్జాతీయ విమానాలపై నిషేధం అమల్లో ఉంది.  కరోనాతో ప్రపంచంలోని పలు దేశాల్లో చిక్కుకొన్న ఇండియన్లను స్వదేశానికి రప్పించేందుకు గాను వందేభారత్ మిషన్ కార్యక్రమం ద్వారా అంతర్జాతీయ విమానాలను నడిపింది ఇండియా.అమెరికా, యుకె, యూఏఈ, కెని్యా, భూటాన్, ఫ్రాన్స్ తో సహా 27 దేశాలతో ఇండియా ఎయిర్ బబుల్ ఒప్పందాలను చేసింది. ఈ ఒప్పందం మేరకు ఆయా భూభాగాల మధ్య ఆయ దేశాల విమాన సంస్థలు నడుస్తాయి. అంతర్జాతీయ విమానాలపై నిషేధం కార్గో విమానాలను లేదని ఇదివరకే డీజీసీఏ స్పష్టం చేసింది. 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం