కరోనా తగ్గుముఖం : సోమవారం నుంచి ఢిల్లీలో అన్‌లాక్ .. ముందుగా వాటికే ప్రాధాన్యత

By Siva KodatiFirst Published May 28, 2021, 3:26 PM IST
Highlights

దేశ రాజధాని ఢిల్లీలో దశలవారీగా లాక్‌డౌన్‌ ఆంక్షలు ఎత్తివేయాలని కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయించింది. ఈ నెల 31 నుంచి ఆంక్షలు సడలించనుంది. ప్రస్తుతం దేశ రాజధానిలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఆంక్షల ఎత్తివేతకు మొగ్గు చూపింది. 

గడచిన 24 గంటల్లో కోవిడ్-19 పాజిటివిటీ రేటు సుమారు 1.5 శాతం ఉందని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. అయితే ఈ వైరస్‌పై పోరాటం ఇంకా ముగియలేదని స్పష్టం చేశారు. ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ సమావేశంలో శుక్రవారం ఆయన ఈ వివరాలు తెలిపారు. 

Also Read:కేంద్రాన్ని వదలని కేజ్రీవాల్... వీటిని ఆచరణలో పెట్టండి, టీకా కొరతపై 4 సూచనలు

క్రమంగా లాక్‌‌డౌన్‌ను ఉపసంహరించాలని నిర్ణయించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. ఈ ప్రక్రియలో ముందుగా అట్టడుగు వర్గాలవారిని దృష్టిలో ఉంచుకోవాలని, వారి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అన్నారు. దినసరి కూలీలు, కార్మికులు వంటివారిపట్ల శ్రద్ధ కనబరచాలని అధికారులను ఆదేశించారు. 

సోమవారం నుంచి ఫ్యాక్టరీలను తెరవడానికి, నిర్మాణ కార్యకలాపాల నిర్వహణకు అనుమతించాలని నిర్ణయించినట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. ప్రతి వారం నిపుణులు, ప్రజలు వెల్లడించే అభిప్రాయాల ఆధారంగా అన్‌లాక్ ప్రక్రియను ప్రభుత్వం కొనసాగిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు.

click me!