అమానవీయం.. ఆలయంలో మహిళను జుట్టు పట్టుకొని లాక్కెళ్లిన సిబ్బంది.. వీడియో వైరల్

By team teluguFirst Published Jan 7, 2023, 10:08 AM IST
Highlights

ఓ మహిళపై కర్ణాటకలోని ఓ వేంకటేశ్వర ఆలయ సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారు. ఆమె జుట్టుపట్టుకొని లాక్కెళ్లారు. ఈ ఘటనపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఓ మహిళపై దేవాలయ సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారు. ఆమెను జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన దృష్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ పరిణామం డిసెంబర్ 21వ తేదీన జరగగా తాజాగా వైరల్ గా మారాయి. వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో ఉన్న ఓ వెంకటేశ్వర ఆలయానికి ఆ మహిళ వచ్చింది. తాను వెంకటేశ్వర స్వామికి మరో భార్యను అని చెప్పింది. 

మద్యం కొనేందుకు అర్హులకే లైసెన్స్ ఇవ్వాలి - తమిళనాడు ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు సూచన

అనంతరం వెంకటేశ్వర స్వామి విగ్రహం పక్కనే కూర్చునేందుకు ప్రయత్నించింది. దీంతో ఆ మహిళను పూజారులు అడ్డుకున్నారు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. పూజారిపై ఉమ్మి వేసింది. దీనిని గమనించి అక్కడున్న ఆలయ సిబ్బంది ఆ మహిళను జుట్టుపట్టుకొని లాక్కెళ్లారు. ఇదంతా ఆ ఆలయంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.

:

Bengaluru: A video shows a woman being repeatedly slapped, held by hair and dragged outside the Lakshmi Narasimha Swamy temple in Amruthahalli, the incident is said to be occurred on December 21. pic.twitter.com/CP4puEMCv4

— IANS (@ians_india)

ఆలయం నుంచి బయటకు నెట్టి వేసిన తరువాత ఆమెను రాడ్ తో కొట్టేందుకు ప్రయత్నించారు. కానీ స్థానికంగా మరో పూజారి దీనిని అడ్డుకున్నాడు. ఈ ఘటనపై సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై అనుచితంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే ఆమె మానసికంగా ఆరోగ్యం సరిగా లేదని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై మహిళ ఫిర్యాదుతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 
 

click me!