
Information Technology Sector: భారతీయ ఐటీ రంగం మొదటిసారిగా మొత్తం ఆదాయంలో $200 బిలియన్లను అధిగమించిందనీ, 2022 ఆర్థిక సంత్సరంలో మొత్తం ఆదాయం $227 బిలియన్లకు చేరుకోనుందని నాస్కామ్ (NASSCOM) పేర్కొంది. భారతదేశ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం (information technology sector) ఒక దశాబ్దంలోనే (2011 నుంచి) అత్యధిక వృద్ధిని నమోదుచేస్తుందని తెలిపింది. ఏకంగా 15.5 శాతం వృద్ది రేటులో ముందుకు సాగుతుందనీ, కరోనా తర్వాత ఇది ఆర్థిక రంగానికి పునరుజ్జీవనం పొందిన సంవత్సరంగా అభివర్ణించింది.
వివరాల్లోకెళ్తే.. భారతదేశ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం (information technology sector) అభివృద్ధి గురించి నాస్కామ్ ప్రెసిడెంట్ దేబ్జానీ ఘోష్ (Debjani Ghosh) స్పందిస్తూ.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ((FY22)) 227 బిలియన్ డాలర్ల పరిశ్రమగా మారనుందని తెలిపారు. ఈ రంగం మొత్తం 15.5 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని తెలిపారు. ఇది ఒక దశాబ్దంలో అత్యధిక వృద్ధి అని వెల్లడించారు. అలాగే, కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ పరిస్థితులను నుంచి మెరుగైన ఫలితాల దిశగా.. కరోనా తర్వాత ఇది ఐటీ-ఆర్థిక రంగానికి పునరుజ్జీవన సంవత్సరంగా దీనిని ఆమె అభివర్ణించారు.
2020-21లో ఐటీ పరిశ్రమ (information technology sector) ఆదాయాలు 2.3 శాతం పెరిగి 194 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2021-22 సంవత్సరానికి తన వార్షిక వ్యూహాత్మక సమీక్షలో, మొత్తం ప్రత్యక్ష ఉద్యోగులను 50 లక్షల మందికి చేర్చడానికి పరిశ్రమ 4.5 లక్షల కొత్త ఉద్యోగాలను జోడించిందని నాస్కామ్ (NASSCOM) ప్రెసిడెంట్ దేబ్జానీ ఘోష్ ఘోష్ తెలిపారు. కొత్తగా నియమితులైన వారిలో 44 శాతానికి పైగా మహిళలు ఉన్నారని పేర్కొన్నారు. వారి మొత్తం వాటా ఇప్పుడు 18 లక్షలకు చేరిందన్నారు. ఎగుమతి రాబడులు 17.2 శాతం పెరిగి 178 బిలియన్ డాలర్లకు చేరుకోగా, దేశీయ ఆదాయాలు 10 శాతం వృద్ధితో 49 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కొత్త యుగం డిజిటల్ సేవల వాటా 25 శాతం వృద్ధి చెంది 13 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భవిష్యత్తులో సాంకేతికతలకు తగినట్లుగా భారతదేశం బలమైన శ్రామిక శక్తిని కలిగి ఉందని నాస్కామ్ (NASSCOM) ప్రెసిడెంట్ దేబ్జానీ ఘోష్ ఘోష్ వెల్లడించారు.
"ఈ వృద్ధిలో ఎగుమతులు పెద్ద పాత్ర పోషించినప్పటికీ, పౌర సేవలను అందించడంలో ఆధార్, UPI, CoWIN వంటి పబ్లిక్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లతో భారతదేశం సాంకేతిక స్వీకరణ కారణంగా దేశీయ మార్కెట్ మొత్తం $50 బిలియన్లకు చేరుకుంది " అని దేబ్జానీ ఘోష్ అన్నారు. ఐదు మిలియన్లకు పైగా టెక్ వర్క్‌ఫోర్స్‌తో భారతదేశం డిజిటల్ టాలెంట్‌కి గ్లోబల్ హబ్‌గా అవతరించిందని తెలిపారు. ఇప్పటికే డిజిటల్ నైపుణ్యం కలిగిన ముగ్గురిలో ఒకరు ఉద్యోగులతో, డిజిటల్ టెక్ టాలెంట్ పూల్ 1.6 మిలియన్ల వద్ద ఉందన్నారు. 2021లో 2,250కి పైగా టెక్ స్టార్టప్‌లు స్థాపించబడ్డాయి. 2021లో ఇప్పటివరకు అత్యధికంగా $24 బిలియన్ల నిధులు సేకరించబడ్డాయి. భారతదేశంలో 2,000 సాఫ్ట్‌వేర్ తయారీ కంపెనీలు, 1,000 SaaS కంపెనీలలతో సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల విభాగంలో ఐటీ సెక్టార్ (information technology sector) మెరుగైన వృద్ధిలో ముందుకు సాగుతున్నది తెలిపారు.