న్యాయవాద వృత్తిలో అసమానతలు: సీజేఐ ఎన్వీ రమణ

Published : Aug 05, 2021, 12:07 PM IST
న్యాయవాద వృత్తిలో అసమానతలు: సీజేఐ ఎన్వీ రమణ

సారాంశం

న్యాయవాద వృత్తిలో ఇంకా ఉన్నాయని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ చెప్పారు. సోసైటీ ఆఫ్ ఇండియన్ లా ఫర్మ్స్ నిర్వహించిన కాఫీ టేబుల్ బుక్ ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బుధవారం నాడు ఆవిష్కరించారు.

న్యూఢిల్లీ:  ఒకప్పుడు లా డిగ్రీ పొందడం చాలా సులువని, కానీ ఆ డిగ్రీ ద్వారా జీవనోపాధి పొందడం సవాల్ గా ఉండేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ చెప్పారు.సోసైటీ ఆఫ్ ఇండియన్ లా ఫర్మ్స్ నిర్వహించిన కాఫీ టేబుల్ బుక్ ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బుధవారంనాడు నాడు ఆవిష్కరించారు. న్యాయవాద వృత్తిలో అసమానతలు  ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ విషయమై  నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను న్యాయవాద డిగ్రీ చదువుతున్న రోజులను ఆయన గుర్తు చేసుకొన్నారు. ఆ సమయంలో మీరు లా డిగ్రీ ఎందుకు చదువుతున్నారని ప్రశ్నించేవారన్నారు. ఎక్కడా కూడ ఉపాధి దొరకదా అని తమను ప్రశ్నించేవారన్నారు.తొలి తరం న్యాయవాదికి న్యాయస్థానాల్లో స్థిరమైన అభ్యాసం కలగా ఉండేదన్నారు. వనరుల కొరత కారణంగా మనలో చాలా మంది ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో  అనేక విషయాలు నేర్చుకొన్నట్టుగా ఆయన  చెప్పారు.

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని పొన్నవరం గ్రామంలో ఆయన జన్మించారు. విద్యార్ధి దశలో ఆయన విద్యార్ధి నాయకుడు. ఆ తర్వాత జర్నలిస్టుగా కొంతకాలం పనిచేశాడు.  ఆ తర్వాత న్యాయవాద వృత్తిని ఎంచుకొన్నారు. న్యాయవాది నుండి జడ్జిగా ఆయన ఎదిగారు.2022 ఆగష్టు 25వ తేదీ వరకు ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా కొనసాగుతారు. గతంలోని పరిస్థితులకు ప్రస్తుత పరిస్థితుల్లో ఏమైనా మార్పులు ఉన్నాయో లేదో తనకు కచ్చితంగా తెలియదన్నారు. అయితే న్యాయవాదులకు అవకాశాల్లో అసమానతలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

దేశ ఆర్ధిక సరళీకరణ చట్టపరమైన దృశ్యాన్ని తీవ్రంగా మార్చిందన్నారు. వ్యాపారం, పెట్టుబడుల పెరుగుదలతో కార్పోరేట్ చట్టాల రంగంలో ప్రత్యేక పరిజ్ఞానం ఉన్న న్యాయవాదుల డిమాండ్ పెరుగుతోందని ఆయన అన్నారు.ఇవాళ భారతీయ న్యాయ సంస్థలు తమ గ్లోబల్ కౌంటర్ పార్టుల మాదిరిగానే అనేక చట్టపరమైన సమస్యలకు అనేక సంస్థలు తమను తాము ఒకే పరిష్కారంగా ఏర్పాటు చేసుకొన్నాయన్నారు.చట్టసంస్థలు ధనికుల సేవ కోసమేననే అభిప్రాయం ప్రబలంగా ప్రజల్లో ఉందన్నారు. న్యాయవాదుల్లో కూడ ఈ రకమైన అపోహ ఉందన్నారు.న్యాయస్థానం కార్యకలాపాలు సమాజంతో సంబంధం ఉండవన్నారు. అటువంటి అవగాహనలను తొలగించడం అవసరమన్నారు.

న్యాయసంస్థలు ప్రస్తుతం టైర్-1నగరాలకే పరిమితమయ్యాయని ఇది వైవిధ్యం లేకపోవడానికి దారితీస్తోందని సీజేఐ చెప్పారు. టైర్-2, టైర్-3 నగరాలకు కూడ వాణిజ్య కార్యకలాపాల కేంద్రాలుగా మారుతున్నాయన్నారు. దీంతో స్థానికంగా ప్రతిభ ఉన్న వారిని ఆయా సంస్థలు లీగల్ సలహాల కోసం నియమించుకోనే అవకాశం ఉందన్నారు. 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌