PM CARES Fund: పీఎం కేర్స్ ఫండ్ ట్రస్టీగా రతన్ టాటా.. ఇంకా ఎవరంటే?

By Mahesh KFirst Published Sep 21, 2022, 2:37 PM IST
Highlights

పీఎం కేర్స్ ఫండ్‌కు కొత్తగా నియమించిన ట్రస్టీల్లో పారిశ్రామిక వేత్త, టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటా ఉన్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కేటీ థామస్, మాజీ డిప్యూటీ స్పీకర్ కరియా ముండా సహా పలువురు ఉన్నారు.

న్యూఢిల్లీ: పీఎం కేర్స్ నిధికి కొత్తగా మరికొందరు ప్రముఖులను ట్రస్టీలుగా నియమించారు. ఇందులో ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా ఉన్నారు. టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటాతోపాటు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కేటీ థామస్, మాజీ డిప్యూటీ స్పీకర్ కరియా ముండా సహా పలువురిని పీఎం కేర్స్ ఫండ్ ట్రస్టీలుగా నియమించారు.

పీఎం కేర్స్ నిధిలో అంతర్భాగమైన నూతన ట్రస్టీలకు స్వాగతం పలుకుతూ ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అమిత్ షా సహా పలువురు ఇప్పటికే పీఎం కేర్స్ ఫండ్‌కు ట్రస్టీలుగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ ట్రస్టీల బోర్డుతో సమావేశం అయ్యారు. పీఎం కేర్స్ ఫండ్ ఆధ్వర్యంలో చేపట్టిన పలు కార్యక్రమాల గురించి ప్రధాని మోడీకి ప్రెజెంటేషన్ ఇచ్చి వివరించారు. ఈ సమావేశంలో రతన్ టాటా కూడా ఉన్నారు. ఈ సమావేశం జరిగిన తర్వాత తాజా ప్రకటన వెలువడటం గమనార్హం.

click me!