టైమ్స్ గ్రూప్ ఛైర్‌పర్సన్ ఇందూ జైన్ కన్నుమూత

Siva Kodati |  
Published : May 13, 2021, 10:47 PM IST
టైమ్స్ గ్రూప్ ఛైర్‌పర్సన్ ఇందూ జైన్ కన్నుమూత

సారాంశం

దేశంలోని ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ గ్రూప్ ఛైర్‌పర్సన్ శ్రీమతి ఇందూ జైన్ కోవిడ్‌తో కన్నుమూశారు. ఆమె వయసు 84 సంవత్సరాలు. 

దేశంలోని ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ గ్రూప్ ఛైర్‌పర్సన్ శ్రీమతి ఇందూ జైన్ కోవిడ్‌తో కన్నుమూశారు. ఆమె వయసు 84 సంవత్సరాలు. 1936 సెప్టెంబర్ 8న ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో ఆమె జన్మించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త అశోక్ కుమార్ జైన్‌ను పెళ్లాడారు.

ఈ దంపతులు సమీర్ జైన్, వినీత్ జైన్ సంతానం. అశోక్ కుమార్ జైన్ హృదయ సంబంధిత అనారోగ్యంతో 1999లో అమెరికాలోని క్వీవ్‌లాండ్‌లో మరణించారు. అనంతరం దేశంలోని అతిపెద్ద మీడియా సంస్థ టైమ్స్ మీడియా గ్రూప్ పగ్గాలను అందుకున్నారు.  

2015లో 3.1 బిలియన్ డాలర్ల సంపదతో ఇందూ జైన్ ఫోర్స్బ్‌ ర్యాంకింగ్స్‌లో స్థానం సంపాదించారు. తద్వారా భారత్‌లోని కుబేరుల్లో 57వ స్థానంలో, ప్రపంచంలో 549వ స్థానంలో నిలిచారు. టైమ్స్ ఫౌండేషన్ ద్వారా ఇందూ జైన్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

అలాగే టైమ్స్ రిలీఫ్ ఫండ్ ద్వారా వరదలు, తుఫానులు, భూకంపాల సమయంలో ఎంతోమందికి సేవలు చేశారు. దేశ పారిశ్రామిక రంగానికి ఇందూ జైన్ చేసిన సేవలకు గాను ఆమెను భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. 

PREV
click me!

Recommended Stories

Indian Railways: గుడిని వదలరు..గుడిలో లింగాన్ని వదలరు..మరీ ఇంత కక్కుర్తా..? ట్రైన్‍లో ఇవి కూడా వదలరా?
జానకమ్మ జీవితం..ఓ చరిత్ర ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా? | Singer S. Janaki Biography | S Janaki Assets