ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం.. వరుస ప్రమాదాల్లో ‘‘ఇండిగో’’

By sivanagaprasad kodatiFirst Published Nov 13, 2018, 8:29 AM IST
Highlights

ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. 179 మంది ప్రయాణికులతో కొచ్చిన్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఇండిగో (6ఈ-6468 )విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ల్యాండింగ్ ప్రధాన గేర్‌లో హైడ్రాలిక్ ఫెయిల్యూర్ అయిందని పైలట్ గుర్తించాడు.

ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. 179 మంది ప్రయాణికులతో కొచ్చిన్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఇండిగో (6ఈ-6468 )విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ల్యాండింగ్ ప్రధాన గేర్‌లో హైడ్రాలిక్ ఫెయిల్యూర్ అయిందని పైలట్ గుర్తించాడు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదని భావించిన పైలట్ అధికారులను, విమాన సిబ్బందిని అప్రమత్తం చేశాడు. విమానాన్ని అత్యవసరంగా కొచ్చిన్ ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లి ల్యాండ్ చేశాడు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.

దీనిపై స్పందించిన ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరో సర్వీసులో గమ్యానికి చేరుస్తామని ప్రకటించింది. పైలట్ గనుక హైడ్రాలిక్ ఫెయిల్యూర్‌ను గుర్తించకపోతే విమానం దిశను పైలట్ నియంత్రించడం సాధ్యపడేది కాదు.. ల్యాండింగ్ సమయంలో ఇబ్బంది తలెత్తి విమానం క్రాష్ అయ్యే అవకాశం ఉంటుంది.

మరోవైపు ఇటీవలికాలంలో ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలు వరుస ప్రమాదాలకు గురవుతున్నాయి. నవంబర్ 10న కోల్‌కతా నుంచి గౌహతి వెళ్తున్న ఇండిగో విమానంలో ఆకస్మాత్తుగా పొగలు రావడంతో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది..

మరో ఘటనలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో రెండు ఇండిగో విమానాలు ఒకే ఎత్తులో ప్రయాణించి ఢీకొట్టుకునేవి.. రెప్పపాటులో ఇద్దరు పైలట్లు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పిపోయింది.. లేనిపక్షంలో రెండు విమానాల్లో ఉన్న ప్రయాణికుల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయేవి. 

click me!