ఆర్ధిక ప్రగతిని పరుగులు పెట్టించడానికి ఈ 8 రంగాల్లో సంస్కరణలు: నిర్మలమ్మ

Published : May 16, 2020, 04:31 PM IST
ఆర్ధిక ప్రగతిని పరుగులు పెట్టించడానికి ఈ 8 రంగాల్లో సంస్కరణలు: నిర్మలమ్మ

సారాంశం

ప్రధానమంత్రి ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆత్మ నిర్భర్ భారత్  ప్యాకేజి భాగంగా రోజుకో రంగం గురించి ఆర్ధిక మంత్రి నిర్మల సీతారాం ప్రస్తావిస్తూ... భారతదేశాన్ని స్వయం సమృద్ధి చేసేందుకు అవసరమైన ప్యాకేజీని ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. 

ప్రధానమంత్రి ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆత్మ నిర్భర్ భారత్  ప్యాకేజి భాగంగా రోజుకో రంగం గురించి ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రస్తావిస్తూ... భారతదేశాన్ని స్వయం సమృద్ధి చేసేందుకు అవసరమైన ప్యాకేజీని ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. 

ఆ వరుస ప్రెస్ కాన్ఫెరెన్సుల్లో భాగంగా నేడు నాల్గవ రోజు కూడా నిర్మల సీతారామన్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపు కూడా ఆమె తన చివరి 5వ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. 

ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా నేడు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న నిర్మల సీతారామన్   నేటి ప్రెస్ మీట్ లో ఫోకస్ అంతా మౌలిక నిర్మాణాత్మకమైన సంస్కరణల మీదనే ఉండబోతుందని తెలిపారు. 

పెట్టుబడులు ఎక్కువగా ఆకర్షించే రంగాల్లో సంస్కరణలను చేయడానికి పూనుకున్నామని, అందువల్ల ఆర్ధిక ప్రగతి సాధించడంతోపాటుగా ఉద్యోగావకాశాలను కూడా పెంపొందిస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు. 

గతంలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ప్రసుత్తవన తరువాత నేటి సంస్కరణల గురించి మాట్లాడారు. నేటి పేస్ కాన్ఫరెన్స్ లో ఎనిమిది రంగాల గురించి ప్రస్తావించనున్నట్టు ఆర్ధిక మంత్రి చెప్పారు. 

బొగ్గు, ఖనిజాలు, రక్షణ ఉత్పత్తులు, పౌర విమానయాన సంస్కరణలు (ఎయిర్ స్పేస్ మానేజ్మెంట్, ఎయిర్ పోర్ట్స్, మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్ హాల్), కేంద్రపాలితప్రాంతాల్లోని విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు, స్పేస్, అణుశక్తి రంగం. ఈ ఎనిమిది రంగాలకు సంబంధించి నేడు సీతారామన్ మాట్లాడారు. 

చాలారంగాల్లో విధానపరమైన సరళీకరణలు చేసినప్పుడు మాత్రమే ఆ రంగాన్ని ఆర్థికంగా పరుగులెత్తించగలిగే ఆస్కారముందని ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆర్ధిక సంస్కరణల విషయంలో కట్టుబడి ఉన్నారని, ఆ నిబద్ధతే ఈ లాక్ డౌన్ కాలంలో ప్రజలందరి చేతుల్లోకి డబ్బు వెళ్లేందుకు అక్కరకు వచ్చిందని ఆమె ఈ సందర్భంగా అన్నారు. 

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu