మానససరోవర్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై నో చైనా, నేపాల్.. ఉత్తరాఖండ్ మీదుగా నేరుగా గమ్యానికి.. గడ్కరీ

Published : Mar 23, 2022, 08:05 AM IST
మానససరోవర్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై నో చైనా, నేపాల్.. ఉత్తరాఖండ్ మీదుగా నేరుగా గమ్యానికి.. గడ్కరీ

సారాంశం

మానససరోవర్ వెళ్లాలనుకుంటున్న యాత్రికులకు గుడ్ న్యూస్.. ఇక మీదట చైనా, నేపాల్ ల మీదుగా ప్రమాదకరప్రయాణం లేకుండా.. ఉత్తరాఖండ్ మీదుగా రోడ్డు మార్గం ద్వారా సులభంగా మానససరోవర్ చేరుకోవచ్చు. ఈ మేరకు గడ్కరీ మంగళవారం పార్లమెంటులో ఓ ప్రకటన చేశారు.   

న్యూఢిల్లీ : డిసెంబర్ 2023 నాటికి Indians చైనా లేదా నేపాల్ మీదుగా వెళ్ళాల్సిన అవసరం లేకుండానే కైలాస Mansarovarని సందర్శించుకోగలరని కేంద్ర మంత్రి Nitin Gadkariమంగళవారం పార్లమెంటులో తెలిపారు. Uttarakhandలోని పితోర్‌గఢ్‌ నుంచి నేరుగా మానసరోవర్‌కు వెళ్లే మార్గాన్ని రూపొందిస్తున్నట్లు రోడ్డు, రహదారుల శాఖ మంత్రి తెలిపారు.

ఉత్తరాఖండ్ గుండా ఏర్పాటు చేస్తున్న ఈ రోడ్డు మానస సరోవరాన్ని చేరుకోవడానికి పట్టే సమయాన్నితగ్గిస్తుందన్నారు. అంతేకాదుం ప్రస్తుతం ప్రమాదకరమైన ట్రెక్కింగ్ లాగా సాగుతున్న ప్రయాణం ఇకపై సాఫీగా నల్లేరు మీద నడకలా సాగుతుందని అన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో తమ మంత్రిత్వ శాఖ రోడ్డు కనెక్టివిటీని పెంచుతోందని, ఇది శ్రీనగర్, ఢిల్లీ లేదా ముంబై మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గిస్తుందని గడ్కరీ పార్లమెంటుకు తెలిపారు. ఈ ప్రాజెక్టులకు రూ.7 వేల కోట్లు ఖర్చయిందని చెప్పారు.

“దీనికోసం లడఖ్ నుండి కార్గిల్, కార్గిల్ నుండి జెడ్-మోర్, జెడ్-మోర్ నుండి శ్రీనగర్,  శ్రీనగర్ నుండి జమ్మూ వరకు నాలుగు సొరంగాలు నిర్మిస్తున్నాం. ఇప్పటికే Z-Morh పనులు పూర్తి చేసుకుని సిద్ధంగా ఉంది. జోజిలా సొరంగంలో ఇప్పటికే పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 1,000 మంది కార్మికులు సైట్‌లో ఉన్నారు. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు 2024 గడువు ఇచ్చాం’’ అని మంత్రి చెప్పారు.

నిర్మాణంలో ఉన్న ఢిల్లీ-అమృత్‌సర్-కత్రా ఎక్స్‌ప్రెస్‌వే ఢిల్లీ, శ్రీనగర్ మధ్య ప్రయాణాన్ని కేవలం ఎనిమిది గంటలకు తగ్గిస్తుందని గడ్కరీ చెప్పారు. రహదారి మంత్రిత్వ శాఖ 650 wayside amenitiesలతో రహదారులను సన్నద్ధం చేస్తుందని గడ్కరీ పార్లమెంటుకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. “28 హైవేలను అభివృద్ధి చేస్తున్నాం, ఇందులో విమానాల కోసం అత్యవసర ల్యాండింగ్ సౌకర్యాలు ఉంటాయి. డ్రోన్లు కూడా తిరగొచ్చు. ప్రమాదం జరిగితే, హెలికాప్టర్ అంబులెన్స్ లను కూడా వాడొచ్చు’’ అన్నారు.

ఇతర ప్రాజెక్టుల గురించి మంత్రి వివరిస్తూ, రైలు మార్గం జాతీయ రహదారులను దాటిన ప్రతిచోటా రోడ్ ఓవర్‌బ్రిడ్జిలు లేదా ఆర్‌ఓబిలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైల్వే క్రాసింగ్‌ల నుండి జాతీయ రహదారులను తొలగించే ప్రతిష్టాత్మక ‘సేతు భారతం’ కార్యక్రమం కింద ఈ కార్యక్రమం వస్తుంది.

“ఆర్థిక మంత్రి ఈ సంవత్సరం మాకు రూ. 1,600 కోట్లు ఇచ్చారు. దానిని సేతు భారతం కోసం కేటాయించాం. మీ నియోజకవర్గంలో రోడ్డు ఓవర్‌బ్రిడ్జి కావాలంటే ప్రతిపాదనలు పంపండి. దానిమీద పనిచేస్తాం’ అని గడ్కరీ అన్నారు. అయితే, ఇలా హడావుడిగా రోడ్లు వేయడం వల్ల రోడ్ల నాణ్యత తక్కువగా ఉందని, ప్రమాదాలు పెరుగుతున్నాయని మంత్రిత్వ శాఖ మీద ప్రతిపక్ష నేతలు విరుచుకుపడ్డారు. ఇదే అంశం మీద సోమవారం గడ్కరీపై ఎదురుదాడికి దిగారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu