Reliance: ఫ్యూచర్ స్టోర్స్ ను రీబ్రాండింగ్ చేస్తున్న రిలయన్స్

Published : Mar 02, 2022, 10:43 PM IST
Reliance: ఫ్యూచర్ స్టోర్స్ ను రీబ్రాండింగ్ చేస్తున్న రిలయన్స్

సారాంశం

Reliance: రిలయన్స్‌ రిటైల్, ఫ్యూచర్ రిటైల్ ల‌ మధ్య జ‌రిగిన ప్ర‌కారం..ఫ్యూచర్ స్టోర్స్ ను రీబ్రాండింగ్ చేస్తుంది రిలయన్స్. విక్రయదారులు, సరఫరాదారులు, స్థల యజమానులు, ఫ్యూచర్ గ్రూప్ సిబ్బందికి ఉపశమన సంకేతమిది. అలాగే.. 30 వేల మందికి ప్యూచ‌ర్ గ్రూప్ ఉద్యోగుల‌కు ఉద్యోగాలు కల్పించనున్నది రిలయన్స్.  

Reliance: రిలయన్స్‌ రిటైల్, ఫ్యూచర్ రిటైల్ ల‌ మధ్య జ‌రిగిన ప్ర‌కారం.. ఫ్యూచర్ స్టోర్స్ ను రీబ్రాండింగ్ చేస్తున్నది రిలయన్స్ గ్రూప్స్.  స్టోర్ లీజులు రిలయన్స్ పేరు మీద ఉండడంతో ఫ్యూచర్ రిటైల్ స్టోర్స్‌ని తీసుకోవడాన్ని రిలయన్స్ ప్రారంభించింది. ఈ కీల‌క పరిణామంతో ఫ్యూచర్ వీటిని నిర్వహించే వీలుండదు.
 ఈ నూత‌న స్టోర్స్ లో పని చేసే వారందరికీ రిలయన్స్ ఉద్యోగావకాశాలను అందిస్తోంది. ఫ్యూచర్ రిటైల్ నెట్ వర్క్ లో పని చేస్తున్న సుమారు 30,000 మందికి వారు ఉద్యోగాలు కొనసాగించేందుకు ఇది వీలు కల్పిస్తుంది. దీంతో ఫ్యూచర్ కంపెనీ ఉద్యోగులు హర్షిస్తున్నారు. నెలల తరబడి కొనసాగిన అనిశ్చితి నుంచి వారు ఉపశమనం పొందారు. ఉద్యోగభద్రత దొరికింద‌ని ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

అదే విధంగా విక్రేతలు, సరఫరాదారులు కూడా ఊరట ల‌భించింది. వారు తమ బకాయిలు పొందుతున్నారు, వ్యాపారం నిలకడగా కొనసాగుతుందని సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. భారీ కార్పొరెట్ సంస్థ తమ నూతన కస్టమర్ కావడం కొత్త వ్యాపార అవకాశాలను అందించగలదన్న ఆశాభావంతో ఉన్నారు. భవన యజమానులు సైతం తమ స్టోర్స్ ను రిలయన్స్ కు లీజు ఇవ్వ‌డానికి ముందుకు వ‌స్తున్నారు. ఎందుకంటే గత ఏడాది అద్దెలు ఫ్యూచర్ గ్రూప్ నుంచి వారికి అందలేదు. ఆ బకాయిలను తీర్చే విషయంలో ఫ్యూచర్ శక్తి సామర్థ్యా లపై వారు అనిశ్చితితో ఉన్నారు. వారితో చర్చించిన పిమ్మట రిలయన్స్ వారి పాత బకాయిలను తీర్చింది మరియు వారు అద్దెలను క్రమం తప్పకుండా పొందగలుగుతున్నారు.

ఫ్యూచర్ గ్రూప్  గ‌త‌ రెండేళ్ల నుంచి కష్టాల ఊబిలో చిక్కుకుంది. రుణదా తలకు చెల్లింపులు చేయలేకపోయింది. 2020 మధ్యలో తన రిటైల్ ఆస్తులను రిలయన్స్ కు విక్రయించేందుకు చర్చలు జరిపింది. అయితే ఈ ఒప్పందం కుదుర్చుకోవడంలో అమెజాన్  లేవనెత్తిన అంశం అడ్డుగా నిలిచింది. ఫ్యూచర్ రిటైల్ బిజినెస్ నియంత్రించేందుకు, ఆ విషయంలో స్వంతంగా నిర్ణయాలు తీసుకోకుండా.. అమెజాన్ ఒప్పందం అవరోధంగా మారింది. కుదుర్చుకునే ఒప్పందం దేశీయ చట్టాలను ఉల్లంఘించినట్టు అవుతుంది, అదే సమయంలో అమెజాన్ ఈ మల్టీ బ్రాండ్ రిటైల్ లో ఇన్వెస్ట్ చేయలేకపోయింది. అలా చేయ‌డం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలు అంగీకరించవు. 

అయితే ఈ రిటైలర్ సంస్థను నియంత్రించాలన్న అమెజాన్ ఆరాటం న్యాయపరమైన వివాదాలకు దారి తీసింది. రిలయన్స్ తో ఒప్పందం కుదుర్చుకోవడంలో జాప్యానికి దారి తీసింది. అది ఉద్యోగుల్లో అనిశ్చితిని ఏర్పరిచింది. విక్రేత లకు, సరఫరాదారులకు వ్యాపారాన్ని తగ్గించింది. భవనాల యజమానులకు, సప్లయర్స్ కు, రుణదాత లకు భారీగా   బకాయిపడేలా చేసింది.  బకాయిలు పేరుకుపోవడంతో రుణదాతలు ఒత్తిళ్లను అధికం చేశారు.

మరో వైపున కంపెనీ దివాళా తీయడం ప్రారంభమైంది. అది గనుక జరిగితే, రుణదాతలకు  ఎంతో నష్టం. అ దే విధంగా కంపెనీ సిబ్బంది అంతా ఉద్యోగాలు కోల్పోతారు. అయితే, నష్టాలు వస్తున్న స్టోర్స్ ను రిలయ న్స్ తీసుకోవడంతో ఇన్ సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ లో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. సర్దుబాటు పథకం గనుక ఆమోదం పొందితే, తమ బకాయిలు రాగలవని రుణదాతలు ఇప్పుడు భావిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi
మోదీ పవర్ ఫుల్ స్పీచ్ కి జపాన్ ప్రధాని ఫిదా: PM Modi Speech Impresses Japan PM | Asianet News Telugu