టార్గెట్ డీఎంకే: తమిళనాడులో కొనసాగుతున్న ఐటీ రైడ్స్

By Siva KodatiFirst Published Apr 2, 2019, 9:11 AM IST
Highlights

తమిళనాడులో ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. వరుసగా రెండో రోజు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

తమిళనాడులో ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. వరుసగా రెండో రోజు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తిరుచందూర్ డీఎంకే ఎమ్మెల్యే రాధాకృష్ణన్ ఇళ్లలో సోదాలు చేస్తున్నారు.

సోమవారం డీఎంకే కోశాధికారి దురైమరుగన్ సిమెంట్ ఫ్యాక్టరీ గోదాములో తనిఖీలు నిర్వహించిన అధికారులు లెక్కలు చెప్పని రూ.11 కోట్ల 53 లక్షల నగదును సీజ్ చేశారు. ఈ మేరకు కరెన్సీ నోట్లను అధికారులు లెక్కిస్తున్నారు.

తన ఫ్యాక్టరీపై ఐటీ దాడులపై డీఎంకే నేత దొరై మురుగన్ స్పందించారు. ఐటీ అధికారులు వచ్చి అడిగి వెళ్లారని, డీఎంకే విజయాన్ని ఎవరు అడ్డుకోలేరని ఆయన స్పష్టం చేశారు. కేంద్రంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఐటీ దాడులు చేయిస్తోందని ఆయన ఆరోపించారు. 

click me!