2047 నాటికి భారత నౌకాదళం 'ఆత్మనిర్భర్' గా మారుతుంది: నావల్ చీఫ్ హరి కుమార్

By Rajesh KarampooriFirst Published Dec 3, 2022, 2:22 PM IST
Highlights

2047 నాటికి భారత నౌకాదళం ఆత్మనిర్భర్ గా మారుతుందని ప్రభుత్వానికి హామీ ఇచ్చిందని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ శనివారం తెలిపారు. ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి కూడా ప్రస్తావించారు. నేవీ చీఫ్ ఆర్ హరి కుమార్ కూడా అగ్నిపథ్ పథకంపై మాట్లాడారు. ఇప్పటి వరకు మొత్తం 3 వేల మంది అగ్నివీరులను నియమించామని, అందులో 341 మంది మహిళా సెయిలర్లు ఉన్నారని తెలిపారు.

2047 నాటికి భారత నౌకాదళం 'ఆత్మనిర్భర్'గా మారుతుందని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ దీమా వ్యక్తం చేశారు.భద్రతా అవసరాల కోసం భారత్ ఇతర దేశాలపై ఆధారపడటం లేదనీ, ఇటీవల జరిగిన ప్రపంచ ఘటనలు నిరూపించాయని అన్నారు. నేవీ వీక్ సందర్భంగా న్యూ ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అడ్మిరల్ హరి కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇండియన్ నేవీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 

ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను ప్రారంభించడం దేశానికి, నావికాదళానికి ఒక చారిత్రాత్మక ఘట్టమని అభివర్ణించారు. ఇది ప్రపంచంలో మన దేశం  ప్రతిష్టను పెంచడానికి దోహదపడిందని పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో ఇండో-పసిఫిక్ సముద్రంలో త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఎగురుతుందని .. ఇది నిజంగా ఆత్మనిర్భర్త యొక్క టార్చ్ బేరర్ అని ఆయన అన్నారు. ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌ను నిర్మించగల సామర్థ్యం చాలా తక్కువ దేశాలు ఉన్నాయని, ఇప్పుడు ఆ జాబితాలో భారత్ కూడా చేరిందని అన్నారు. ఈ ఘటన మనలో ఆత్మవిశ్వాసాన్ని ప్రేరేపిస్తుందనీ, ఇది మన స్వదేశీ సామర్థ్యానికి ప్రకాశించే చిహ్నమని అన్నారు. ఇది ప్రపంచంలో మన దేశ ఔన్నత్యాన్ని పెంపొందించడానికి దోహదపడిందని అన్నారు.
 
ఈ ఏడాది ప్రారంభించిన అగ్నిపథ్ పథకం కింద జరిగిన రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ల గురించి అడ్మిరల్ హరి కుమార్ మాట్లాడుతూ..  ఇప్పటివరకు 3,000 మంది అగ్నివీరులు నేవీలో చేరారని, వీరిలో 341 మంది మహిళలు ఉన్నారని చెప్పారు. నేవీలో చేరాలని యువతకు సూచించారు. మహిళలను  7-8 శాఖలకు మాత్రమే కాకుండా అన్ని శాఖలలో మహిళా అధికారులను చేర్చుకోవాలని భావిస్తున్నామని ఆయన చెప్పారు.

కొత్త జెండాను ఎందుకు ఆవిష్కరించారు?

నౌక దళంలో వలసవాద చిహ్నాలు, పద్ధతులు, అవశేషాలను పూర్తిగా తొలగించాలనే ఉద్దేశంలో నౌకదళం నూతన పతాకాన్ని ఆవిష్కరించిందని ఆర్ హరి కుమార్  తెలిపారు. కొత్త డిజైన్‌ను ఓ సైనికుడు తయారు చేశాడు. వ్యవస్థను సరిదిద్దాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. నూతనంగా ప్రారంభించిన విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌తో విమానాల అనుసంధానం వచ్చే ఏడాది మే లేదా జూన్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని హరి కుమార్ బుధవారం తెలిపారు. ఇప్పటికే ఎయిర్‌క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ టెస్ట్ ప్రారంభించినట్లు తెలిపారు.

విమానం ల్యాండింగ్ సిస్టమ్ గురించి మనం మొదట తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుతం ఆ పరీక్షలు జరుగుతున్నాయనీ, వర్షాకాలానికి ముందు అంటే.. మే లేదా జూన్‌లో పూర్తి చేయాలని భావిస్తున్నామని అన్నారు. అలాగే.. ఎన్డీఏలోకి మొదటి బ్యాచ్ మహిళా క్యాడెట్‌లను చేర్చుకోవడంతో లింగ తటస్థతను పాటించినట్టు అయ్యిందని పేర్కోన్నారు. మహిళలు ఇప్పటికే పోరాట సేవలు ఉన్నారనీ, నౌకాదళంతో సహా బలగాల్లో మహిళా అధికారులు ఉన్నారని తెలిపారు.

బిపిన్ రావత్ ప్రస్తావన

విలేకరుల సమావేశంలో అడ్మిరల్ కుమార్ దివంగత జనరల్ బిపిన్ రావత్ గురించి కూడా ప్రస్తావించారు. మూడు సర్వీసుల మధ్య సమన్వయం పెంపొందించడానికి  బిపిన్ రావత్ పునాది వేశారని అన్నారు. నూతన సీడీఎస్ జనరల్ చౌహాన్ కూడా అదే దిశలో నడుస్తున్నారనీ, అదే ప్రేరణతో ముందుకు వెళ్తున్నారని తెలిపారు. 

click me!