ముంబయిలో భారీ అగ్ని ప్రమాదం..  కిటికీలోంచి దూకిన బాలిక..

By Rajesh KarampooriFirst Published Dec 3, 2022, 1:21 PM IST
Highlights

ముంబయిలోని మలాద్ ప్రాంతం నుండి పిడుగులాంటి వార్త బయటకు వచ్చింది. జాన్‌కళ్యాణ్‌నగర్‌ సమీపంలోని బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భవనంలోని మూడో అంతస్తులో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 వాహనాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి.

ముంబయిలోని మలాడ్ వెస్ట్ సెవ్రీ ప్రాంతంలోని ఓ గోడౌన్‌లో శనివారం (డిసెంబర్ 3) భారీ అగ్నిప్రమాదం జరిగింది. జాన్‌కళ్యాణ్‌నగర్‌ సమీపంలోని 21 అంతస్తుల భవనంలోని మూడో అంతస్తులో గదిలో మంటలు చెలరేగినట్లు బృహన్‌ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) వెల్లడించింది. ఈ సంఘటన ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడినట్లు తెలుస్తోంది. క్షత్రగాత్రులను చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు తెలిపిన సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.  

జనకళ్యాణనగర్‌లోని మెరీనా ఎన్‌క్లేవ్‌లోని మూడో అంతస్తులోని ఓ ఫ్లాట్‌లో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే ఈ అంతస్తు నుంచి మంటలు రావడం మొదలైంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని కేవలం 15 నిమిషాల్లో మంటలను అదుపులోకి తెచ్చినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఓ బాలిక కిటీకిలోంచి దూకి ప్రాణాలు కాపాడుకుంది. ఈ సమయంలో ఆ బాలికకు స్వల్పగాయాలు అయ్యాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. దీని తర్వాత మాత్రమే వివరణాత్మక వివరణ ఇవ్వబడుతుంది.
 

click me!