తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన.. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తుండగా.. ఈ సారి అమెరికా ఫ్లైట్‌లో ఘటన

By Mahesh KFirst Published Apr 25, 2023, 1:43 AM IST
Highlights

న్యూయార్క్ నుంచి ఢిల్లీకి ఓ ఫ్లైట్‌లో వస్తున్న భారతీయ ప్రయాణికుడు ఫుల్‌గా తాగేసి తోటి ప్రయాణికుడితో గొడవపడ్డారు. అనంతరం, ఆ ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశారు.
 

న్యూఢిల్లీ: కొన్ని నెలల క్రితం పూటుగా తాగి విమానంలో ప్రయాణం చేస్తూ మైమరిచి తోటి ప్యాసింజర్ పై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేయడం దేశవ్యాప్తంగా కలకల రేపిన సంగతి తెలిసిందే. తాజాగా, అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తుండగా ఓ భారత ప్రయాణికుడు తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. ఆ వ్యక్తి ఫుల్‌గా తాగి ఉన్నాడని విమాన సిబ్బంది తెలిపింది. తోటి ప్రయాణికుడితో ఆర్గ్యుమెంట్ తర్వాత ఆ ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేసినట్టు సమాచారం అందింది. గతంలో మన దేశానికి చెందిన విమాన సంస్థ ఫ్లైట్‌లో ఈ ఘటన జరగ్గా.. తాజాగా అమెరికాకు చెంది విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.


ఫ్లైట్‌లో ఆన్‌బోర్డులో తాము ఒక గందరగోళాన్ని ఎదుర్కొన్నామని అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. ‘అమెరికాన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 292 అమెరికాలోని జాన్ ఎఫ్ కెన్నెడి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరాల్సి ఉన్నది. కానీ, మధ్యలో విమానంలో గలాట జరగడంతో ఫ్లైట్ ల్యాండ్ కాగానే పోలీసులను ఆశ్రయించామ’ని వివరించింది.

Latest Videos

Also Read: దక్షిణాదిపై బీజేపీ ఫోకస్.. కేరళలో ప్రధాని రెండు రోజుల పర్యటన.. నేడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం

ఆ అమెరికన్ ఎయిర్‌లైన్ ఫ్లైట్ రాత్రి 9 గంటలకు ఢిల్లీకి చేరుకుంది. కానీ, అప్పటికే సిబ్బంది ఇక్కడి అధికారులకు ఆ గలాట గురించి తెలిపాడు. 

ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు ఓ రిపోర్ట్ అందింది. అనంతరం, డీజీసీఏ తగిన చర్యలు తీసుకున్నట్టు కొన్ని వర్గాలు వివరించాయి. దాని ఇంటర్నల్ ప్రొసీజర్ ప్రకారం, ఈ ఘటనపై మరింత దర్యాప్తు చేయబోతున్నట్టు తెలిపాయి.

కాగా, ఈ ఘటనకు సంబంధించి తమకు ఏ ఫిర్యాదూ అందలేదని డీసీపీ(ఎయిర్‌పోర్టు) దేవేశ్ కుమార్ మహలా తెలిపారు. 

click me!