దుబాయ్‌లో కారు యాక్సిడెంట్.. భారతీయుడు, బంగ్లాదేశీయుడికి రూ. 90 లక్షల ఫైన్.. యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే?

By Mahesh KFirst Published Dec 24, 2022, 4:14 PM IST
Highlights

దుబాయ్‌లో కారు యాక్సిడెంట్ జరిగి.. అందులో ఇద్దరు సౌదీ మహిళలు మరణించారు. రోడ్డు మధ్యలో కారు ఆపి బంగ్లాదేశీయుడు రివర్స్ తీశాడు. ఇది గమనించని ఇండియన్ ఆ కారును ఢీకొట్టేశాడు. వీరిద్దరి కార్లు మరో కారును ఢీకొట్టింది. ఆ మూడో కారులో ఓ సౌదీ కుటుంబం ప్రయాణం చేస్తున్నది. యాక్సిడెంట్ కేసులో బంగ్లాదేశ్, భారత పౌరులు ఇద్దరినీ దోషులుగా తేల్చి రూ. 90 లక్షలు జరిమానా చెల్లించాలని దుబాయ్ ట్రాఫిక్ కోర్టు ఆదేశించింది.
 

న్యూఢిల్లీ: దుబాయ్‌లో ఈ ఏడాది జులైలో ఓ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సౌదీ మహిళలు మరణించారు. ఈ కేసులోనే తాజాగా దుబాయ్‌ కోర్టు ఒక భారతీయుడిని, ఒక బంగ్లాదేశీయుడిని దోషులుగా తేల్చింది. వారిద్దరికీ రూ. 90 లక్షల జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని బాధితుల కుటుంబాలకు అందించాలని ఆదేశించింది.

దోషులుగా తేలిన ఇద్దరిని సుమారు రూ. 90,18,436 రూపాయలు (ఏఈడీ 400,000)లు చెల్లించాలని జరిమానా విధించింది. ఇండియాకు చెందిన డ్రైవర్‌కు రూ. ఏఈడీ 2,000 (సుమారు రూ. 45,092)ల జరిమానా, ఏఈడీ 80,000లు (సుమారు రూ. 18,003,683)లు బాధిత కుటుంబాలకు బ్లడ్ మనీ కింద అందించాలని ఆదేశించింది. మిగతా మొత్తాన్ని బంగ్లాదేశీయుడు చెల్లించాలని తెలిపింది.

దుబాయ్‌లోని అల్ బర్షాలో జులై 3వ తేదీన ఈ యాక్సిడెంట్ జరిగింది. ఇందులో ఇద్దరు మహిళలు మరణించారు. 48 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరూ కారును నిర్లక్ష్యంగా నడిపారని, అందుకే యాక్సిడెంట్ జరిగిందని దుబాయ్ ట్రాఫిక్ కోర్టు పేర్కొన్నట్టు ది నేషనల్ రిపోర్ట్ చేసింది. ఈ కార్లు ఢీ కొన్న తర్వాత కొంత సమయంలోపే ఇద్దరు మహిళలు మరణించారని వివరించింది. కాగా, మరో నలుగురు కుటుంబ సభ్యులకు స్వల్ప గాయాలు అయ్యాయి.

Also Read: లక్నో - ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచు కారణంగా ఢీకొన్న వాహనాలు.. ముగ్గురు మృతి..

మీడియాలో కథనాల ప్రకారం యాక్సిడెంట్ జరిగిన తీరు కూడా అనూహ్యంగా ఉన్నది. బంగ్లాదేశ్‌ పౌరుడు తన కారును మెయిన్ రోడ్డులో మధ్యలో ఆపాడు. అంతేకాదు, ఆ కారును రివర్స్ తీశాడు. కాగా, మరో కారులో అటుగా వస్తున్న భారతీయుడు రివర్స్ తీస్తున్న వాహనాన్ని సరిగ్గా గమనించలేదు. దీంతో ఆ కారును ఢీకొట్టేశాడు. ఆ తర్వాత ఈ రెండు కార్లూ మరో (మూడో) కారును ఢీకొట్టింది. ఆ మూడో కారులో సౌదీ అరేబియాకు చెందిన ఓ కుటుంబం ప్రయాణిస్తున్నదని ఓ మీడియా రిపోర్టు వివరించింది.

click me!