
ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఈ నెల 10వ తేదీన ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఏడు విడతల పోలింగ్‌తో ముగియగా.. ఉత్తరాఖండ్, గోవా అసెంబ్లీ ఎన్నికలు గత నెల 14వ తేదీన సింగిల్ ఫేజ్‌లో ముగిశాయి.
2017లో పంజాబ్‌లో 77.4% ఓటింగ్ నమోదు కాగా ప్రస్తుతం 69.65 శాతం మాత్రమే ఓటింగ్ లో పాల్గొన్నారు. ఈసారి పంజాబ్ ఎన్నికల్లో 1,304 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 93 మంది మహిళలుండగా.. ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. అభ్యర్థులందరి భవితవ్యాన్ని ఈవీఎం యంత్రాల్లో నిక్షిప్తమైంది. మార్చి 10 న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో తేలనుంది. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1,02,00,996 మంది మహిళలు సహా 2,14,99,804 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Punjab లో ఈ సారి బహుముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), బీజేపీ కూటమి ల మధ్య పోటీ నెలకొంది. అలాగే రైతులు సంస్థల రాజకీయ విభాగమైన ‘యునైటెడ్ సమాజ్ మోర్చా’ కూడా గట్టి పోటీ ఇవ్వనున్నట్టు అంచన వేస్తున్నారు.
ఈ ఎన్నికల్లో ఎస్‌ఎడి .. బిఎస్‌పితో పొత్తుతో పెట్టుకోగా.. బిజెపితో మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. అలాగే.. సుఖ్‌దేవ్ సింగ్ ధిండా నేతృత్వంలోని శిరోమణి అకాలీదళ్ (యునైటెడ్)తో కూడా పొత్తు పెట్టుకుంది. కేంద్రంలోని వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమంలో పాల్గొన్న పంజాబ్‌లోని అనేక రైతు సంఘాలు ‘సయుక్త్ సమాజ్ మోర్చా’ (ఎస్‌ఎస్‌ఎం)ను ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేయడం గమనార్హం.