ఇండియా మొత్తం ఉత్తరాఖండ్ వెంటే: మోడీ

Published : Feb 07, 2021, 02:51 PM IST
ఇండియా మొత్తం ఉత్తరాఖండ్ వెంటే: మోడీ

సారాంశం

భారతదేశం యావత్తూ ఉత్తరాఖండ్ వెంట అండగా నిలుస్తోందని  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో మంచు చరియలు విరిగిపడిన ఘటన తర్వాత మోడీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.


న్యూఢిల్లీ: భారతదేశం యావత్తూ ఉత్తరాఖండ్ వెంట అండగా నిలుస్తోందని  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో మంచు చరియలు విరిగిపడిన ఘటన తర్వాత మోడీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

 

మంచు కొండలు విరిగి పడడంతో ధౌలిగంగా నదికి వరద పోటెత్తింది. వరద నీటి ఉధృతికారణంగా పవర్ ప్రాజెక్టులోకి వరద నీరు చేరింది. అంతేకాదు  ఈ ప్రాజెక్టుకు సమీపంలోని ఆనకట్ట కూడ కొట్టుకుపోయింది.

also read:ఉత్తరాఖండ్‌‌లో విరిగిపడ్డ మంచుచరియలు, దౌలిగంగా నదికి వరద: హైఅలెర్ట్

పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ప్రధాని ప్రకటించారు.ఉత్తరాఖండ్  భద్రత కోసం దేశం ప్రార్ధిస్తుందని మోడీ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. సీనియర్ అధికారులతో నిరంతరం మాట్లాడుతున్నట్టుగా మోడీ తెలిపారు. 

ధౌలిగంగతో పాటు అలకానంద నదులకు ఇవాళ ఆకస్మాత్తుగా వరదలు వచ్చాయి. దీంతో నదుల పరివాహక ప్రాంతాల్లో వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రిషిగంగా విద్యుత్ ప్రాజెక్టును వరద నీటితో దెబ్బతింది.

PREV
click me!

Recommended Stories

Aadhaar Card New Rules : 2026లో ఆధార్ అప్‌డేట్ చేయాలంటే ఈ పత్రాలు తప్పనిసరి !
Jobs : కేవలం జనవరి ఒక్క నెలలోనే.. లక్ష ఉద్యోగాల భర్తీకి సర్కార్ సిద్దం