భారత్ లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

By telugu news teamFirst Published Sep 5, 2020, 11:41 AM IST
Highlights

ప్రస్తుతం భారత్ లో 8,46,395 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 31,07,223 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.


భారత్ లో కరోనా మహమ్మారి రోజు రోజుకీ విజృంభిస్తోంది. ప్రతిరోజూ కేసులు పెరుగుతున్నాయే తప్ప తరగడం లేదు. తాజాగా భారత్ లో 86,432 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,089 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40,23,179 కు చేరుకుంది. 

ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 69,561 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 8,46,395 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 31,07,223 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4,77,38,491 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి వెల్లడించింది. గత 24గంటల వ్యవధిలో నమోదైన మొత్తం కేసుల్లో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ లోనే ఎక్కువ ఉన్నాయి. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో ఉన్న క్రీయాశీలక కేసుల్లో 62శాతం ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఉండడం గమనార్హం. అలాగే ఇప్పటి వరకు సంభవించిన మరణాల్లోనూ 70శాతం ఈ రాష్ట్రాల్లోనే ఉన్నాయి. 

click me!