బస్సుని ఢీకొట్టిన ట్రక్కు... ఏడుగురి మృతి

Published : Sep 05, 2020, 10:29 AM ISTUpdated : Sep 05, 2020, 10:48 AM IST
బస్సుని ఢీకొట్టిన ట్రక్కు... ఏడుగురి మృతి

సారాంశం

ఓ బస్సు వలసకూలీలను ఒరిస్సా, గంజాంనుంచి గుజరాత్‌లోని సూరత్‌కు తరలిస్తోంది. శనివారం తెల్లవారుజామున రాయ్‌పూర్‌లోని చెరి ఖేడి వద్దకు రాగానే ఓ ట్రక్కును ఢీకొట్టింది. 

ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సుని ఓ ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర సంఘటన శనివారం తెల్లవారుజామున ఛత్తీష్‌ఘడ్‌, రాయ్‌పూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ బస్సు వలసకూలీలను ఒరిస్సా, గంజాంనుంచి గుజరాత్‌లోని సూరత్‌కు తరలిస్తోంది. శనివారం తెల్లవారుజామున రాయ్‌పూర్‌లోని చెరి ఖేడి వద్దకు రాగానే ఓ ట్రక్కును ఢీకొట్టింది. 

దీంతో బస్సు నుజ్జునుజ్జయి అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఏడుగురు తీవ్రగాయాలపాలయ్యారు.  సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయాలపాలైన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.

PREV
click me!

Recommended Stories

BRICS 2026: గ్లోబల్ సౌత్ బిగ్ బాస్.. బ్రిక్స్ తో భారత్ సాధించిన టాప్ 5 విజయాలు ఏంటో తెలుసా?
BRICS: స‌వాళ్ల‌ను క‌లిసి ఎదుర్కోవాలి.. బ్రిక్స్ స‌ద‌స్సు ముగింపు వేళ మోదీ కీల‌క ప్ర‌సంగం