24 గంటల్లో 96 వేల కరోనా కేసులు: ఇండియాలో మొత్తం 45.62 లక్షలకి చేరిక

By narsimha lodeFirst Published Sep 11, 2020, 10:38 AM IST
Highlights

 కరోనా కేసులు దేశంలో రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 96,551 కేసులు నమోదయ్యాయి. 
 

న్యూఢిల్లీ: కరోనా కేసులు దేశంలో రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 96,551 కేసులు నమోదయ్యాయి. 

ఒక్క రోజులో ఇంత పెద్ద మొత్తంలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అంతే కాదు కరోనాతో ఒకే రోజులో 1209 మంది గత 24 గంటల్లో మరణించారు.శుక్రవారం నాటికి దేశంలో కరోనా కేసులు 45 లక్షల 62 వేల 414కి చేరుకొన్నాయి. ఒక్క రోజు వ్యవధిలో కరోనా నుండి 35.42 లక్షల మంది కోలుకొన్నారు.ఇప్పటివరకు కరోనాతో దేశంలో 76 వేల మంది రోగులు మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నివేదికలు చెబుతున్నాయి.

also read:కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్న కరోనా: 20 రోజుల్లోనే ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి

కరోనా కేసుల్లో ప్రపంచంలోనే ఇండియా రెండోస్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 2.8 కోట్ల మందికి కరోనా సోకింది.కరోనా సోకిన రోగులు రికవరీ కావడం 77.76 శాతంగా ఉంది. కరోనా సోకిన రోగుల మరణా రేటు 1.6 శాతంగా ఉంది.

130 కోట్ల జనాభా ఉన్న ఇండియాలో ఇప్పటివరకు 5.4 కోట్ల మంది నమూనాలను మాత్రమే పరీక్షించారు. నిన్న 11.6 లక్షల నమూనాలను పరీక్షించారు. ఈ మాసంలో ఇప్పటివరకు 11,72,179 మంది శాంపిల్స్ సేకరించారని ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి.
 

click me!