భారత ఆర్మీ కోసం 1000 నిఘా కాప్టర్లు అవసరం.. పాక్, చైనాలతో సరిహద్దుల్లో అనూహ్య పరిస్థితులు

Published : Oct 20, 2022, 06:37 PM IST
భారత ఆర్మీ కోసం 1000 నిఘా కాప్టర్లు అవసరం.. పాక్, చైనాలతో సరిహద్దుల్లో అనూహ్య పరిస్థితులు

సారాంశం

భారత సరిహద్దులో పరిస్థితులు ఎప్పుడూ ఎలా మారుతాయో అంచనా కట్టేలా లేవని కేంద్రం తెలిపింది. కాబట్టి, శత్రువుల కదలికలు, వాహనాలు, ట్రూపులపై నిఘా అవసరం అని వివరించింది. అక్కడ ఏమైనా బిల్డ్ అప్‌లు చేపడుతున్నా వెంటనే గుర్తించి వాటిని ఎదుర్కోవడానికి భారత ఆర్మీ సిద్ధపడటానికి నిఘా కాప్టర్లు అవసరం అని తెలిపింది.ఇందుకోసం భారత ఆర్మీకి 1000 నిఘా కాప్టర్లు కొనుగోలు చేయడానికి కేంద్రం సిద్ధమైంది.  

న్యూఢిల్లీ: భారత ఆర్మీ కోసం 1000 నిఘా కాప్టర్ల కొనుగోలు కోసం కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ప్రపోజల్ రిక్వెస్టులు జారీ చేసింది.  వీటిని అత్యవసర కొనుగోలు కోసం ఫాస్ట్ ట్రాక్‌లో ప్రొసీజర్ చేపట్టనుంది. ఈ కాప్టర్లు యాక్సెసరీలతో పాటుగా కొనుగోలు చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

భారత ఉత్తర సరిహద్దుల్లో ప్రస్తుత అనూహ్య, తక్షణమే మారిపోయే పరిస్థితులు ఉన్నాయని వివరించింది. చైనాతో సరిహద్దు, అలాగే, ఎల్‌వోసీలోనూ పరిస్థితులు అంచనా వేసేలా లేవని పేర్కొంది. కాబట్టి, నిరంతరం నిఘా అవసరం అని వివరించింది. ఆ సరిహద్దుల్లో ఎలాంటి కదలికలు, నిర్మాణాలు, ఆర్మీ ట్రూపులు కూడగడుతున్నా వెంటనే వాటిని ఎదుర్కోవడానికి భారత ఆర్మీకి అందుకు సంబంధించిన సమాచారం అవసరం పడుతుంది. కానీ, నిఘా లేనందున ఈ పరిస్థితులను తీవ్రరూపంగా మార్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి, వాటిని ముందుగానే పసిగట్టి అందుకు తగినట్టుగా భారత ఆర్మీ సంసిద్ధంగా ఉండాలనే నిరంతర, నిరాటంక నిఘా అవసరం అని భారత ఆర్మీ వివరించింది. ఇందుకు ఇండియన్ ఆర్మీకి సర్వెలెన్స్ అవసరం పడిందని తెలిపింది.

ఈ నిఘా కోసం అవసరమైన పరికరాలను వాయిదా వేస్తే దారుణ పరిస్థితులు ఏర్పడే ముప్పు లేకపోలేదని వివరించింది. 

Also Read: శత్రువులతో వీరోచితంగా పోరాడిన ఇండియన్ ఆర్మీ డాగ్ ‘జూమ్’ ఇక లేదు..

అందుకే సర్వెలెన్స్ కాప్టర్ కొనుగోలు చేయాలనే ఆలోచన చేసినట్టు వివరించింది. ఈ సర్వెలెన్స్ కాప్టర్లు ఏరియల్ సర్వెలెన్స్ సామర్థ్యం కలిగి ఉంటాయని, కచ్చితమైన పాయింట్ సర్వెలెన్స్‌ను కూడా భారత ఆర్మీకి ఇవి అందిస్తాయని అధికారులు తెలిపారు. సర్వెలెన్స్ కాప్టర్ ఒక ఆదర్శవంతమైన మల్టీ సెన్సార్ సిస్టమ్. ఇది రియల్ టైమ్‌లో రేయింబవళ్లు నిర్దేశిత ప్రాంతాన్ని పర్యవేక్షిస్తుందని వివరించారు. 

ఈ సిస్టమ్ కచ్చితమైన లొకేషన్‌లో శత్రువుల నిర్మాణాలను గుర్తిస్తుందని వివరించారు. హై రిజల్యూషన్ ఫొటోలు అందించడం వల్ల టార్గెట్‌ను ఈజీగా డిటెక్ట్ చేయవచ్చని తెలిపారు. అలాగే, ఆర్మీ కదలికలనూ, సరిహద్దులో ఇతర వ్యవహారాలు, వాహనాల కదలికలనూ సులువుగా గుర్తించవచ్చని వివరించారు.

అయితే, ఒక సర్వెలెన్స్ కాప్టర్ బరువు 10 కిలోలకు మించరాదు. కానీ, ఎక్కువ ఎత్తుకు ఎగరగలగాలి. బలమైన గాలులను తట్టుకోవాలి. అలాగే, 12 నుంచి 14 నాట్‌ల వేగంతో వచ్చే గాలులను కూడా ఎదుర్కోగలగాలి. సగటు సముద్ర మట్టానికి 4000 మీటర్ల ఎత్తులో దీన్ని ఆపరేట్ చేయగలగాలి. గ్రౌండ్ లెవెల్ నుంచి 500 మీటర్ల ఎత్తులో ఆపరేట్ చేయగలగాలి. ఇది పూర్తిగా ఆటనమస్, మ్యానువల్, హూవర్, రిటర్న్ హోమ్ మోడ్‌లలో పని చేయాలి.

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu