ఒకప్పుడు నెలకు రూ.5000 మాత్రమే .. ఇప్పుడు కోట్లకు అధిపతి..ఇండియాలో అత్యంత ధనవంతుడైన యూట్యూబర్ సక్సెస్ స్టోరీ

By Mahesh Rajamoni  |  First Published Sep 10, 2023, 3:43 PM IST

పట్టుదల ఉంటే చాలు ఉన్నత శిఖరాలను అధిరోహించి చూపించొచ్చు అన్న ముచ్చటను మనం మన చుట్టూ ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులను చూసి నేర్చుకోవచ్చు. ఇలాంటి వారిలో ఒక యూట్యూబర్ కూడా ఉన్నాడు. ఆయన భారతదేశంలో అత్యంత ధనవంతుడు కూడాను. ఇతన సంపాదన ఎంతో తెలుసా? 
 



ప్రస్తుత కాలంలో యూట్యూబ్, సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. పాటలు వినడం నుంచి సినిమాలు చూడటం, షార్ట్ ఫిల్మ్స్, వీడియోలు అంటూ నచ్చిన వాటిని ఒక్క యూట్యూబ్ లోనే చూడొచ్చు.  అయితే ఈ యూట్యూబ్ కేవలం వినోదాన్ని పంచడమే కాదు.. ఎంతోమందికి ఇది ఆదాయ వనరుగా కూడా మారింది. అవును చాలా మంది కంటెంట్ క్రియేటర్లకు, యూట్యూబర్ లకు స్టార్ డమ్, డబ్బు రెండింటినీ పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే ఈ రోజు మనం ఇలాంటి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్ గురించి, అతని సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం.. 

భువన్ బామ్ గురించి తెలియని వారు చాలా తక్కువ మందే ఉన్నారు. ఎందుకంటే ఇతను తన ఫన్నీ షార్ట్ వీడియో సిరీస్ తో జనాలకు బాగా దగ్గరైపోయాడు. అందుకే ఇతను ప్రస్తుతం ఎంతో ప్రసిద్ధి చెందాడు. తన షార్ట్ వీడియోలో ఎన్నో పాత్రలను పోషిస్తూ మంచి గుర్తింపును పొందాడు. అప్పటి నుంచే బామ్ ఇంటర్నెట్ ప్రపంచంలో తన బ్రాండ్ ను నిర్మించుకున్నాడు. ఒక గొప్ప పేరు సంపాదించుకున్నాడు.

Latest Videos

భువన్ బామ్ మధ్యతరగతి కుటుంబానికి చెందిని వాడు. ఇతను ఎంటర్ టైన్మెంట్ రంగంలో ప్రామిసింగ్ మ్యూజిషియన్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేశాడు. కానీ ఇప్పుడు కళ్లు చెదిరే అత్యధిక నికర విలువను కలిగిన భారతదేశపు టాప్ యూట్యూబర్ గా మారిపోయాడు. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. గుజరాత్ లోని వడోదరకు చెందిన భువన్ బామ్ సంగీత ప్రస్థానం నుంచి కీర్తి, విజయాల దిశగా తన ప్రయాణాన్ని గొప్పగా ప్రారంభించాడు.

కొన్ని ఇంటర్వ్యూలు, మీడియా కథనాల ప్రకారం.. భువన్ బామ్ కేఫ్ లు, రెస్టారెంట్లలో మ్యూజీషియన్ గా పనిచేస్తూ నెలకు రూ.5000 మాత్రమే సంపాదించేవాడు. అయితే సింగింగ్ కెరీర్ ను వదిలేసి ఇతను కంటెంట్ క్రియేషన్ కోసం యూట్యూబ్ లోకి అడుగుపెట్టాడు.

undefined

యూట్యూబ్ లో భువన్ బామ్ ఫస్ట్ వీడియో కాశ్మీర్ నుంచి వైరల్ వీడియో పేరడీ. అయితే ఇతని మొదటి వీడియోతో తనలో ఉన్న హాస్య ప్రతిభను మొత్తం లోకానికి తెలిసేలా చేశాడు. ఇది ఎంతో మందికి నచ్చింది. ఇక దీని తర్వాత భువన్ బామ్ బీబీ కీ వైన్స్ అనే సిరీస్ ను స్టార్ట్ చేశాడు. దీనిలో భువన్ బామ్  అతను, తన కుటుంబం, స్నేహితులు అంటూ వివిధ పాత్రలను పోషిస్తూ షార్ట్ వీడియోలను పోస్ట్ చేశాడు. స్పూఫ్ వీడియోలు, ఉల్లాసకరమైన వ్యాఖ్యానాలను క్రియేట్ చేశాడు. బీబీ కీ వైన్స్ చాలా తొందరగా జనాల్లోకి వెళ్లింది. అలాగే మంచి పేరు సంపాదించింది. ఇది ఇప్పటివరకు 26 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లను కలిగి ఉంది.

భువన్ బామ్ నికర విలువ సుమారు 15 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.122 కోట్లు ఉంటుందట. అతని బ్రాండ్ ఎండార్స్మెంట్, ఆన్లైన్ సిరీస్ లు, మూవీ రోల్స్, యూట్యూబ్ వీడియో అమ్మకాలు అన్నీ అతని సంపదకు దోహదం చేశాయి.

click me!