G20 Summit: ముగిసిన సదస్సు.. బ్రెజిల్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోడీ

Published : Sep 10, 2023, 03:09 PM IST
G20 Summit: ముగిసిన సదస్సు.. బ్రెజిల్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోడీ

సారాంశం

జీ 20 శిఖరాగ్ర సమావేశాలు నేటితో ముగిశాయి. నిన్న మొదలైన ఈ సమావేశాలు ఈ రోజుతో ముగిశాయి. తదుపరి అధ్యక్షత బాధ్యతలను బ్రెజిల్ స్వీకరించారు. ప్రధాని మోడీ ఈ బాధ్యతలను బ్రెజిల్ అధ్యక్షుడు డి సిల్వాకు అప్పగించారు.  

న్యూఢిల్లీ: భారత అధ్యక్షతన జరిగిన 20 శిఖరాగ్ర సదస్సు ఈ రోజు ముగిసింది. తదుపరి బాధ్యతలను బ్రెజిల్ స్వీకరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డి సిల్వాకు ఈ బాధ్యతలు అప్పగించారు. దీనికి సంకేతంగా ఉండే సుత్తె వంటి గవెల్‌ను బ్రెజిల్ అధ్యక్షుడు డి సిల్వాకు భారత ప్రధాని మోడీ అప్పగించారు.

జీ 20 సదస్సు అధ్యక్షత బాధ్యతను వచ్చే ఏడాదికి గాను బ్రెజిల్ స్వీకరించారు. ఈ సదస్సు పై ప్రధాని మోడీ సంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఒకే ధరిత్రి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ లక్ష్యంగా కృషి చేయడానికి జీ 20 సదస్సు అంగీకరించడం సంతోషంగా ఉన్నదని వివరించారు. అనేక అంశాలపై సభ్య దేశాలు చర్చించినట్టు చెప్పారు.

ప్రపంచ దేశాల్లో అనేక మార్పులు వచ్చాయని, అందుకు అనుగుణంగానే అంతర్జాతీయ సంస్థలు కూడా సంస్కరించుకోవాలని ప్రధాని మోడీ సూచించారు. ఇందులో భాగంగా ఐక్యరాజ్య సమితి కూడా సంస్కరణలు చేసుకోవాలని వివరించారు. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాల సంఖ్యను పెంచాలని సూచించారు.

Also Read: జీ20 సదస్సు నుంచి స్వల్ప విరామం.. అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించిన రిషి సునక్, భార్య అక్షతామూర్తి

జీ 20 సదస్సులో న్యూఢిల్లీ డిక్లరేషన్‌కు ఆమోదం లభించింది. అన్ని దేశాలు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ పరిణామాన్ని స్వాగతించాయి.

PREV
click me!

Recommended Stories

EPI 2024 లో అద్భుత ర్యాంకు సాధించిన యూపీ.. అసలు ఇదేమిటో తెలుసా?
Budget : ఆ ఒక్క బడ్జెట్ దేశ జాతకాన్నే మార్చేసింది.. డ్రీమ్ బడ్జెట్ అసలు కథ ఇదే !