India Pakistan War : బరితెగించిన పాక్ .. ఈ ప్రాంతాలే టార్గెట్ గా మిస్సైల్ దాడులు

Arun Kumar P   | ANI
Published : May 10, 2025, 07:24 AM IST
India Pakistan War : బరితెగించిన పాక్ .. ఈ ప్రాంతాలే టార్గెట్ గా మిస్సైల్ దాడులు

సారాంశం

తాజాగా 26 భారతీయ ప్రాంతాలపై పాకిస్థాన్ దాడికి ప్రయత్నించగా వెంటనే ప్రతిస్పందించిన భారత్ తిప్పికొట్టింది. అయితే దేశంలోని ప్రధాన ప్రాంతాలపై పాాక్ మిస్సైల్స్, డ్రోన్ ఎటాక్ కు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. పాక్ దాడులకు భారత్ ప్రతిదాడులు చేస్తోంది.    

India Pakistan War : భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరుదేశాలు పరస్పరం మిస్సైల్స్, డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నారు. శుక్రవారం రాత్రంతా ఈ దాడులు కొనసాగాయి... జమ్మూ కాశ్మీర్ తో పాటు పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు పాక్ డ్రోన్లు ప్రయత్నించగా భారత్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని గాల్లోనే పేల్చేసాయి. 

ఇక పాకిస్థాన్ యుద్దవిమానాలు కూడా సరిహద్దులు దాడి భారత భూభాగంలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. అంతేకాదు దేశ రాజధాని డిల్లీపై పాక్ యుద్దవిమానాలు పతేహ్ క్షిపణిని ప్రయోగించినట్లు సమచారం... అయితే దీన్నికూడా భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గుర్తించి గాల్లోనే పేల్చివేసినట్లు తెలుస్తోంది. 

శుక్రవారం రాత్రి నుండి శనివారం ఉదయం వరకు భారతదేశంలోని 26 ప్రాంతాలపై పాకిస్థాన్ దాడులకు యత్నించినట్లు తెలుస్తోంది. అయితే భారత ఆర్మీ వెంటనే స్పందించి పాక్ దాడులకు తిప్పికొట్టింది... మిస్సైల్స్, డ్రోన్లను కూల్చివేసింది. 

నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి అనేక ప్రదేశాలలో ఇండియా, పాక్ ఆర్మీ మధ్య కాల్పులు జరుగుతున్నాయి. అయితే జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్‌లోని డిబ్బర్ ప్రాంతంలో  పెద్ద పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఇక రాజౌరీ ప్రాంతంలో వరుస పేలుళ్ల కారణంగా ఇళ్లు, ఆస్తులు దెబ్బతిన్నాయని...  అఖ్నూర్‌లలో కూడా పెద్ద పేలుళ్లు వినిపించాయని స్థానికులు చెబుతున్నట్లు  ఏఎన్ఐ తెలిపింది. 

నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సాధారణ పౌరులనే లక్ష్యంగా చేసుకుని పాక్ జరుపుతున్న దాాడులను భారత్ అడ్డుకుంది. జమ్మూ, సాంబా, పఠాన్‌కోట్ సెక్టార్లలో పాకిస్థాన్ డ్రోన్లు మళ్లీ కనిపించాయి. అయితే పాక్ జరిపిన కాల్పుల్లో తెలంగాణ యువ ఆర్మీ జవాన్ మురళీ నాయక్ ప్రాాణాలు కోల్పోయాడు. యుద్దభూమిలో అతడు పాక్ మూకలతో పోరాడుతూ వీరమరణం పొందాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu