ఇండియాలో తగ్గుతున్న కోవిడ్ కేసులు

Published : Jun 30, 2021, 10:29 AM ISTUpdated : Jun 30, 2021, 10:37 AM IST
ఇండియాలో తగ్గుతున్న కోవిడ్ కేసులు

సారాంశం

ఇండియాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే నిన్నటితో పోలిస్తే బుధవారం నాడు కరోనా కేసులు 22 శాతం పెరిగాయి.  గత 24 గంటల్లో 45,951 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,03,62,846కి చేరాయి. గత 24 గంటల్లో కరోనాతో 817 మంది మరణించారు. దీంతో కరోనాతో మరణించినవారి సంఖ్య 3,98,454కి చేరింది.

న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే నిన్నటితో పోలిస్తే బుధవారం నాడు కరోనా కేసులు 22 శాతం పెరిగాయి.  గత 24 గంటల్లో 45,951 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,03,62,846కి చేరాయి. గత 24 గంటల్లో కరోనాతో 817 మంది మరణించారు. దీంతో కరోనాతో మరణించినవారి సంఖ్య 3,98,454కి చేరింది.

దేశంలో క్రియాశీల కేసులు 5,37,064కి చేరాయి. గత 24 గంటల్లో కరోనా నుండి 60,729 మంది కోలుకొన్నారు. కరోనా రోగుల రికవరీ రేటు 96.87 శాతానికి చేరింది. ఇండియాలో కరోనా నుండి  2.94 కోట్ల మంది కోలుకొన్నారు.కరోనా కేసుల క్రియాశీల రేటు 1.62 శాతానికి తగ్గింది.గత 24 గంటల్లో 19,60,757 మంది శాంపిల్స్ పరీక్షిస్తే 45,951  కరోనా కేసులు నమోదయ్యాయి.  దేశంలో నిన్న ఒక్క రోజే 36,51,983 మంది టీకాలు వేయించుకొన్నారు. ఇప్పటివరకు 33.28 కోట్ల మంది టీకాలు తీసుకొన్నారు. కరోనా వ్యాక్సినేషన్ పై కేంద్రం వేగం పెంచింది. మరో వ్యాక్సిన్ కు కేంద్రం అనుమతిచ్చింది. మోడెర్నాకు వ్యాక్సిన్ మంగళవారం నాడు డీసీజీఐ అనుమతిని ఇచ్చింది.

PREV
click me!

Recommended Stories

AI Smart Glasses : పోలీసుల చేతికి ఏఐ అస్త్రం.. ఈ మ్యాజిక్ గ్లాసెస్ నేరస్తులను ఎలా గుర్తిస్తాయి?
uttar Pradsh : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే టాప్... ఏ రాష్ట్రమో తెలుసా?