కన్న కూతురికి బీరు తాగించిన తండ్రి.. తల్లి కి తెలియడంతో..!

Published : Jun 30, 2021, 07:28 AM IST
కన్న కూతురికి బీరు తాగించిన తండ్రి.. తల్లి కి తెలియడంతో..!

సారాంశం

ఓ వ్యక్తి.. తాను మద్యం సేవించడంతోపాటు.. ఆ మందు తన ఏనిమిదేళ్ల కుమార్తెకు కూడా తాగించాడు. 

కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. ప్రతి తల్లిదండ్రులు.. తమ బిడ్డలకు మంచి భవిష్యత్తు అందించాలని... వారు ఎలాంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా ఉండాలని కోరుకుంటారు. అలాంటిది ఓ వ్యక్తి.. తాను మద్యం సేవించడంతోపాటు.. ఆ మందు తన ఏనిమిదేళ్ల కుమార్తెకు కూడా తాగించాడు. ఈ దారుణ సంఘటన కేరళలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తర కేరళలోని హోస్‌దుర్గ్‌లో ఓ తండ్రి తన ఎనిమిదేళ్ల కూమార్తెకు బీరు తాగించాడు. అనంతరం పనిమీద బయటకు వెళ్లాడు. అయితే, బాలిక ఉన్నట్టుండి వాంతులు చేసుకోవడం మొదలు పెట్టింది. బిడ్డకు ఏమైందోనని కంగారు పడ్డ.. ఆమెను హుటహుటిన స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లింది.

దీంతో వైద్యలు మద్యం బాలిక మద్యం సేవించడం వల్ల వాంతులు చేసుకుందని, ఇప్పుడు బాగానే ఉందని తెలిపారు. భర్త నిర్వాకాన్ని సహించని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల బాలిక వాంగ్మూలం సేకరించి.. ఆమె తండ్రిపై కేసు నమోదు చేశారు. అతన్ని అరెస్టు చేసి రెండు వారాలు రిమాండ్‌కు తరలించారు.

PREV
click me!

Recommended Stories

BRICS: స‌వాళ్ల‌ను క‌లిసి ఎదుర్కోవాలి.. బ్రిక్స్ స‌ద‌స్సు ముగింపు వేళ మోదీ కీల‌క ప్ర‌సంగం
BRICS Summit: డాలర్‌కు చెక్.. అమెరికాకు షాక్.. భారత్ మాస్టర్ ప్లాన్‌తో మారనున్న గ్లోబల్ ట్రేడ్