కేరళలో ఆగని కరోనా ఉధృతి: ఇండియాలో మొత్తం కేసులు 3.26 కోట్లకు చేరిక

By narsimha lodeFirst Published Aug 29, 2021, 10:54 AM IST
Highlights


ఇండియాలో గత 24 గంటల్లో 45,083 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.  అంతకుముందు రోజుతో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య 8,783కి పెరిగాయి. కేరళ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి.

న్యూఢిల్లీ: గత 24 గంటల్లో ఇండియాలో  45,083 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,26,95,90,30కి చేరుకొన్నాయి. గత 24 గంటల్లో కరోనాతో 460 మంది మరణించారు.కరోనాతో మరణించినవారి సంఖ్య 4,37,830కి చేరుకొంది.

అంతకు ముందు రోజుతో పోలిస్తే ఇండియాలో కరోనా కేసులు ఒక్క రోజులోనే 8,783కి పెరిగాయి.దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3,68,558కి చేరింది. కరోనా నుండి ఇప్పటివరకు  3,18,88,642కి చేరింది. కరోనా పాజిటివిటీ రేటు 2.57 శాతానికి చేరుకొంది.కరోనా రోగుల రికవరీ శాతం 97.53 శాతంగా నమోదైందిదేశంలోని కేరళ రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కేరళలో కొత్తగా 31, 265 కరోనా కేసులు నమోదయ్యాయి.  కరోనాతో 153 మంది మరణించారు.

కేరళలో కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేస్తున్నట్టుగా ప్రకటించింది. రాష్ట్రంలో వారం రోజుల పాటు  రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేస్తామని  సీఎం పినరయి విజయన్ ప్రకటించారు.  రాత్రి  10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తామని కేరళ సీఎం తెలిపారు.

click me!