ప్రియుడితో రాసలీలలు చూసిన భర్త హత్య: నిందితులను పట్టిచ్చిన పచ్చబొట్టు

Published : Aug 29, 2021, 09:37 AM IST
ప్రియుడితో రాసలీలలు చూసిన భర్త హత్య: నిందితులను పట్టిచ్చిన పచ్చబొట్టు

సారాంశం

ప్రియుడితో రాసలీలల్లో ఉన్న భార్యను ప్రత్యక్షంగా చూసిన భర్త ఆమెను నిలదీశాడు.ఈ విషయమై ప్రియుడిని భార్యతో గొడవకు దిగాడుఈ ఘర్షణలో భర్తను హత్య చేశారు.మృతుడి చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.ఈ ఘటన న్యూఢిల్లీలో చోటు చేసుకొంది.


:న్యూఢిల్లీ:ఓ హత్య కేసును మృతదేహంపై ఉన్న టాటూ ఆధారంగా పోలీసులు  నిందితుడిని గుర్తించేలా చేసింది. ఈ ఘటన న్యూఢిల్లీలో చోటు చేసుకొంది.న్యూఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీ ప్రాంతంలోని డ్రైన్ లో  ఓ ట్రాలీ బ్యాగ్ లో  ఓ వ్యక్తి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో స్థానికులు గుర్తించారు. ఈ విషయమై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో మృతుడి భార్య అతని ప్రియురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ నెల 10వ తేదీన పోలీసులకు ఓ సమాచారం అందింది. సుఖ్‌దేవ్ విహార్ లోని ఓ డ్రెయిన్‌లోని సూట్‌కేసులో మృతదేహం ఉన్న విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సూట్‌కేుసులో కుళ్లిన మృతదేహన్ని గుర్తించారు. మృతదేహంపై నవీన్ అనే టాటూ ఉంది.వ్యక్తిని చంపి మృతదేహన్ని డ్రైన్‌లో  వేసినట్టుగా  డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఆర్సీ మీనా ఓ ప్రకటనలో తెలిపారు.ఈ ఘటనపై ఐపీసీ 302,201 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

దక్షిణ ఢిల్లీలోని వెబ్‌సరాయ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నవీన్ అనే వ్యక్తి అదృశ్యమైనట్టుగా  పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు కూడా అందింది.,ఈ నెల 8వ తేదీ నుండి తన భర్త కన్పించడం లేదని నవీన్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఆగష్టు 11న తన అద్దె ఇంటి నుండి ముస్కాన్ వెళ్లిపోయింది. ఆమె మొబైల్ ఫోన్ ఆధారంగా కాన్పూర్‌లోని కొత్త ఇంట్లో తల్లితో పాటు తన రెండేళ్ల కూతురితో ముస్కాన్ ఉంటున్నట్టుగా పోలీసులు గుర్తించారు.

నవీన్ మృతదేహంపై పచ్చబొట్టు ఉంటుందనే విషయాన్ని భార్య ముస్కాన్ ఖండించింది. కానీ నవీన్ సోదరుడు ఈ విషయాన్ని ధృవీకరించారు.  ముస్కాన్ కథనం ప్రకారంగా ఈ నెల 7వ తేదీన తనకు తన భర్త నవీన్ కు మధ్య ఘర్షణ చోటు చేసుకొందని ముస్కాన్ చెప్పారు. నవీన్ కొట్టడంతో తన నోటి నుండి రక్తం రావడంతో  తాను చికిత్స కోసం ఎయిమ్స్ కు వెళ్లినట్టుగా ఆమె చెప్పారు. తాను ఇంటికి తిరిగి వచ్చే సరికి నవీన్  ఇంట్లో లేడని ఆమె పోలీసులకు తెలిపింది.నవీన్ కన్పించకుండా పోయిన ఐదు రోజుల తర్వాత ఆమె ఫిర్యాదు చేయడంపై పోలీసులు ఆమెను ప్రశ్నించారు. ముస్కాన్ ఫోన్ కాల్ డేటాను పరిశీలించిన పోలీసులకు కీలక సమాచారం లభ్యమైంది. 

తన ప్రియుడు జమాల్‌తో ముస్కాన్  టచ్‌లో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఆగష్టు 7వ తేదీన జమాల్ ఫోన్ లేకేషన్ ముస్కాన్ ఇంటి పరిసరాలను చూపింది. ఈ నె 8వ తేదీన నవీన్ మృతదేహన్ని సూట్‌కేసులో తీసుకెళ్లారని పోలీసులు గుర్తించారు. ఈ నెల 7వ తేదీన జమాల్ తన నివాసంలో ఉన్న సమయంలో నవీన్ చూశాడని ముస్కాన్ చెప్పారు.ఈ విషయమై తమ మధ్య ఘర్షణ చోటు చేసుకొందన్నారు. ఈ  కేకలు విన్న ఇంటి బయట ఉన్న జమాల్ స్నేహితులు వచ్చి నవీన్ ను హత్య చేశారని ఆమె చెప్పారు.

రక్తంతో తడిని బట్టలను ట్రాలీ బ్యాగ్ లో ప్యాక్ చేసి సుఖ్‌దేవ్ విహార్ డ్రైన్ లో విసిరేసినట్టుగా పోలీసులు  ఆ ప్రకటనలో తెలిపారు. ముస్కాన్ ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఢిల్లీలోని దేవ్లీకి చెందిన వివేక్, యూపీలో మొరాబాద్ స్టేషన్ లో జమాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.నవీన్ ను చంపడానికి జమాల్ ను ఇతరులను ప్రేరేపించినందరకు ముస్కాన్ తల్లిని కూడా అరెస్ట్ చేశారు.

 


 

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు