ఇండియాలో పెరుగుతున్న కరోనా కేసులు: కేరళలోనే 30 వేల కేసుల నమోదు

By narsimha lodeFirst Published Aug 27, 2021, 10:20 AM IST
Highlights

ఇండియాలో కరోనా కేసుల్లో పెరుగుదల కన్పిస్తోంది. నిన్న ఒక్క రోజే 44,658 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 3.26 కోట్లకు చేరుకొంది. దేశంలోని కేరళ రాష్ట్రంలో కరోనా కేసుల వరుసగా రెండో రోజు  30 వేల కేసులు దాటాయి.
 

న్యూఢిల్లీ:ఇండియాలో  గత 24 గంటల్లో కరోనా కేసులు 44,658 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3.26 కోట్లకు చేరాయి. నిన్న ఒక్క రోజే కరోనాతో  496 మంది మరణించారు. కరోనాతో మరణించినవారి సంఖ్య 4,36,861కి చేరింది.

నిన్న ఒక్క రోజే కరోనా నుండి  32,988 మంది కోలుకొన్నారు.  కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3,44,899కి చేరింది. యాక్టివ్ కేసులు 1.06 శాతానికి పెరిగాయి. కరోనా నుండి ఇప్పటివరకు దేశంలో  3.18 కోట్ల మంది కోలుకొన్నారు. కరోనా రోగుల రికవరీ రేటు 97.60 శాతంగా నమోదైంది. 

దేశంలో కేరళ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అత్యధికంగా నమోదౌతోంది. గతంలో మహారాష్ట్రలో అత్యధిక కేసులుంటే ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో అధిక కేసులు నమోదౌతున్నాయి. నిన్న కూడా  కేరళ రాష్ట్రంలో 30 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 162 మంది మరణించారు. కేరళ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన ఓనం పండుగా కారణంగా కరోనా కేసుల ఉధృతి పెరిగిందని ఆ రాష్ట్ర వైద్యశాఖాధికారులు అంచనా వేస్తున్నారు.


 

click me!