స్కూల్లో 26మంది చిన్నారులకు కరోనా.. థర్డ్ వేవ్ ఎఫెక్ట్.?

Published : Aug 27, 2021, 07:57 AM IST
స్కూల్లో 26మంది చిన్నారులకు కరోనా.. థర్డ్ వేవ్ ఎఫెక్ట్.?

సారాంశం

కరోనా సోకిన పిల్లల్లో నలుగురు 12 ఏళ్ల లోపు వయసు వారున్నారు.కరోనా సోకిన నలుగురు పిల్లలను నాయర్ ఆసుపత్రికి తరలించారు. 12 ఏళ్ల వయసు పైబడి కరోనా సోకిన 22 మంది బోర్డింగ్ స్కూలు విద్యార్థులను రిచర్డ్ సన్ క్వారంటైన్ సెంటరుకు తరలించారు.

కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ మన దేశంలో ప్రారంభమైందా అనే సందేహాలు మొదలౌతున్నాయి.  ముఖ్యంగా ముంబయి నగరంలో ఈ సంకేతాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ముంబై నగరంలోని అగ్రిపదలోని బోర్డింగ్ స్కూలులో 26 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది. సెయింట్ జోసెఫ్ బోర్డింగ్ స్కూలులో ఉన్న 95 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయగా వారిలో 26 మందికి కరోనా పాజిటివ్ అని వెల్లడైంది. 

కరోనా సోకిన పిల్లల్లో నలుగురు 12 ఏళ్ల లోపు వయసు వారున్నారు.కరోనా సోకిన నలుగురు పిల్లలను నాయర్ ఆసుపత్రికి తరలించారు. 12 ఏళ్ల వయసు పైబడి కరోనా సోకిన 22 మంది బోర్డింగ్ స్కూలు విద్యార్థులను రిచర్డ్ సన్ క్వారంటైన్ సెంటరుకు తరలించారు.

కరోనా వ్యాప్తితో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సెయింట్ జోసెఫ్ బోర్డింగ్ స్కూలుకు సీలు వేశారు. దేశంలోని 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 720 మంది పిల్లలు కరోనా బారిన పడ్డారు.వీరిలో 686 మంది పిల్లలు బాలల షెల్టర్ హోంలలో ఉన్నవారే కావడం విశేషం. హర్యానాలో అత్యధికంగా 288 మంది పిల్లలు కరోనా బారిన పడ్డారు. తమిళనాడులో 149 మంది, బిహార్ లో 131 మంది పిల్లలు కొవిడ్ తో చికిత్స పొందుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Makarajyothi: ఘనంగా మకర జ్యోతి ఉత్సవం.. దర్శనానికి పోటెత్తిన లక్షలాది స్వాములు | Asianet News Telugu
Petrol Price : లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.200... ఎక్కడో కాదు ఇండియాలోనే..!