కరోనా: ఇండియాలో మళ్లీ పెరిగిన కేసులు, మరణాలు

By narsimha lodeFirst Published Jul 7, 2021, 10:03 AM IST
Highlights

ఇండియాలో కరోనా కేసులు పెరిగాయి.  మొన్నటితో పోలిస్తే నిన్న కరోనా కేసులు పెరిగినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్  తెలుపుతుంది.

న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా కేసులు పెరిగాయి.  మొన్నటితో పోలిస్తే నిన్న కరోనా కేసులు పెరిగినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్  తెలుపుతుంది.గత 24 గంటల్లో ఇండియాలో 43,733 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాదు కరోనాతో  930 మంది మరణించారు. రెండు రోజుల క్రితం మూడు నెలల కనిష్టానికి కరోనా కేసులు పడిపోయాయి. కానీ ఒక్క రోజు వ్యవధిలోనే కేసులు పెరిగాయి. 

గత 24 గంటల్లో  కరోనా నుండి  47,240 మంది కోలుకొన్నారు. కరోనా రోగుల రికవరీ రేటు 97.18 శాతానికి చేరుకొంది. ధేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4,59,920కి తగ్గిందని వైద్య ఆరోగ్య శాఖ నివేదిక వెల్లడిస్తోంది.  దేశంలో ఇప్పటివరకు 2,97,99, 594 మంది కోలుకొన్నారు. కరోనాతో ఇప్పటివరకు 4,04,211 మంది మరణించారు.దేశంలో నిన్న ఒక్క రోజే  36,05,998 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకొన్నారు. ఇప్పటివరకు 36,13,23,548 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకొన్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.


 

click me!