కేంద్ర మాజీ మంత్రి భార్య దారుణ హత్య..!

Published : Jul 07, 2021, 09:41 AM IST
కేంద్ర మాజీ మంత్రి  భార్య దారుణ హత్య..!

సారాంశం

దిండుతో ఆమెను ఊపిరి ఆడకుండా చేసి చంపారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. 

కేంద్ర మాజీ మంత్రి పీఆర్ కుమార మంగళం భార్య  దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కిట్టి కుమారమంగళం (67) దక్షిణ ఢిల్లీలోని వసంత్‌విహార్ ప్రాంత ఇంట్లో శవమై బుధవారం ఉదయం కనిపించారు. దిండుతో ఆమెను ఊపిరి ఆడకుండా చేసి చంపారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కిట్టీ కుమారమంగళం హత్య కేసులో నిందితుడు ఒకరిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఈ హత్య కేసులో మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నామని ఢిల్లీ పోలీసులు చెప్పారు. మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో హత్య ఘటన చోటు చేసుకుందని పోలీసులు పేర్కొన్నారు.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?