ఇండియాలో 24 గంటల్లో 43,393 కోవిడ్ కేసులు: మొత్తం 3,07,52,950కి చేరిక

By narsimha lodeFirst Published Jul 9, 2021, 10:23 AM IST
Highlights

ఇండియాలో అంతకుముందు  పోలిస్తే కరోనా రికవరీ కేసుల సంఖ్య పెరిగింది. మొన్న కరోనా కేసుల సంఖ్య కంటే రికవరీ కేసులు తక్కువగా నమోదయ్యాయి. కొంత కాలంగా దేశ వ్యాప్తంగా 50 వేల లోపుగానే కరోనా కేసులు నమోదౌతున్నాయి.


న్యూఢిల్లీ: ఇండియాలో  గత 24 గంటల్లో  43,393 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒక్క రోజులో 911 మంది మరణించారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,07,52,950కి చేరుకొంది. కరోనా నుండి ఇండియాలో ఇప్పటివరకు 2,98,88,284 మంది కోలుకొన్నారు. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4,58, 727కి చేరింది. కరోనాతో ఇండియాలో  ఇప్పటివరకు 4,05, 939 మంది మరణించారు. 

 నిన్న ఒక్క రోజే  17,90,708 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు ఇండియాలో 42.7 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.  గత 24 గంటల్లో కరోనా నుండి 44,459 మంది కోలుకొన్నారు.  ఇండియాలో కరోనా రికవరీ రేటు  97.19 శాతానికి చేరింది. గత రోజుతో పోలిస్తే కరోనా కేసుల కంటే రికవరీ కేసుల సంఖ్య పెరిగింది.యాక్టివ్ కేసుల సంఖ్య 1.49 శాతానికి తగ్గింది.దేశంలో నిన్న ఒక్క రోజే 40,23,173 మంది కరోనా వ్యాక్సిన్ వేయించుకొన్నారు. ఇప్పటివరకు 36,89,91,222 మంది వ్యాక్సిన్ తీసుకొన్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. 

click me!