కారు దిగొచ్చి మరీ పెళ్లి చేసిన సీఎం స్టాలిన్..!

Published : Jul 09, 2021, 09:51 AM IST
కారు దిగొచ్చి మరీ పెళ్లి చేసిన సీఎం స్టాలిన్..!

సారాంశం

తిరువారూర్‌ సమీపం పిన్నవాసల్‌ మెయిన్‌ రోడ్డు ప్రాంతంలోని ఓ కల్యాణమండపం ముందు నూతన వధూవరులు చోప్రా-రమలను సీఎం గమనించారు.


దాదాపు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు.. సామాన్యుల పెళ్లిళ్లకు హాజరు కానీ.. తమిళనాడు ముఖ్యమంత్రి మాత్రం.. తన రూట్ సపరేట్ అని నిరూపించారు. తాను వెళ్తున్న మార్గమధ్యలో ఓ దంపతులు పెళ్లి జరుగుతుంటే.. తన కారు ఆపి మరీ వచ్చి వారిని ఆశీర్వదించాడు. 

పూర్తి వివరాల్లోకి వెళితే... సీఎం బుధవారం తిరువారూర్‌ నుంచి కారులో తిరుక్కువనైకు బయల్దేరారు. తిరువారూర్‌ సమీపం పిన్నవాసల్‌ మెయిన్‌ రోడ్డు ప్రాంతంలోని ఓ కల్యాణమండపం ముందు నూతన వధూవరులు చోప్రా-రమలను సీఎం గమనించారు. వెంటనే కారు ఆపి కిందకు దిగి వారి వద్దకు వెళ్లి విచారించగా, మీ చేతుల మీదుగా మాకు విహహం జరిపించాలని కోరారు. అనంతరం సీఎం సమక్షంలో వరుడు చోప్రా వధువు రమకు మాంగల్యధారణ చేశాడు. వారిని ఆశీర్వదించిన ముఖ్యమంత్రి అక్కడ నుంచి బయల్దేరి వెళ్లారు. కాగా.. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. కాగా.. సీఎం స్వయంగా వచ్చి పెళ్లి జరిపించడంతో.. వధూవరులతో పాటు.. కుటుంబసభ్యులు, బంధువులు ఆనందం వ్యక్తం చేస్తారు.

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !