సీపీఎం కార్యాలయాలకు నిప్పు.. బయట ఉన్న వాహనాలకూ

Published : Sep 08, 2021, 08:11 PM IST
సీపీఎం కార్యాలయాలకు నిప్పు.. బయట ఉన్న వాహనాలకూ

సారాంశం

త్రిపురలో సీపీఎం పార్టీ కార్యాలయాలను గుర్తుతెలియని దుండగులు నిప్పంటించారు. వాటి ముందు పార్క్ చేసిన వాహనాలకూ నిప్పు పెట్టారు. ఇది బీజేపీ పనే అని సీపీఎం ఆరోపించింది. కాదు, ఆ కార్యాలయాల నుంచే తమపైకి పెట్రో బాంబులు విసిరారని బీజేపీ ఆరోపించింది.  

గువహతి: త్రిపురలో సీపీఎం, బీజేపీకి మధ్య ఘర్షణలు హింసాత్మకంగా మారుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఇరుపార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వీటిని నిరసిస్తూ రాష్ట్రరాజధాని అగర్తలాలో బీజేపీ కార్యకర్తలు ర్యాలీలు తీశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పార్టీకి చెందిన రెండు కార్యాలయాలకు దుండగులు నిప్పు అంటించారు. ఇందులో రాజధాని అగర్తలోని హెడ్‌క్వార్టర్ కూడా ఉండటం గమనార్హం. 

సీపీఎం రాష్ట్ర హెడ్‌క్వార్టర్ భాను స్మృతి భవన్, దశరథ్ భవన్‌లకు గుర్తుతెలియని దుండగులు నిప్పు అంటించారు. ఆ కార్యాలయాల ఎదుట ఉన్న వాహనాలకూ నిప్పు పెట్టారు. ఈ పని బీజేపీవాళ్లదేనని సీపీఎం పార్టీ ఆరోపిస్తున్నది. కాగా, బీజేపీ ఖండించింది. తమపైనే సీపీఎం కార్యాలయాల నుంచి పెట్రో బాంబులు విసిరారని బీజేపీ ఆరోపించింది.

PREV
click me!

Recommended Stories

పల్లెటూరిలో ప్రపంచ స్థాయి వైద్య సదస్సు.. దేశంలో తొలిసారి అంతర్జాతీయ కార్డియాక్ కాన్ఫరెన్స్
మెల్ బోర్న్ క్రికెట్ స్టేడియంలో మోదీ కి అదిరిపోయే వెల్ కమ్ | PM Modi visits Melbourne Cricket Ground