ఇండియాలో 37,875 కొత్త కేసులు: కేరళలోనే 25 వేల కేసులు

By narsimha lodeFirst Published Sep 8, 2021, 11:26 AM IST
Highlights

ఇండియాలో నమోదౌతున్న కరోనా కేసుల్లో కేరళ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నాయి. దేశంలో నిన్న 37,875 మందికి కరోనా సోకింది. అయితే ఇందులో కేరళ రాష్ట్రంలోనే 25 వేలకు పైగా కేసులు రికార్డయ్యాయి. కేరళలో కరోనా వ్యాప్తిని అదుపునకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది.

న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రెండు రోజులుగా కొత్త కేసుల నమోదు తగ్గాయి. కానీ బుధవారం నాడు మళ్లీ కేసులు పెరిగాయి. గత 24 గంటల్లో 37,875 మందికి కరోనా సోకింది. 24 గంటల్లో 15.53 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. దేశంలో కరోనా కేసులు 3,30,96,718కి చేరుకొంది.

తాజాగా నమోదైన కేసులతో దేశంలో కరోనా యాక్టివ్ కేసులు  3,91, 256కి చేరుకొంది. కేరళ రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతుంది. కొత్త నమోదైన కేసుల్లో 25 వేలు కేరళ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే కరోనాతో కేరళలో 189 మంది మరణించారు.

దేశ వ్యాప్తంగా కరోనాతో నిన్న 39,114 మంది కోలుకొన్నారు. ఇప్పటివరకు 3.22 కోట్ల మంది కరోనా నుండి కోలుకొన్నారు. కరోనా రోగుల రికవరీ రేటు 97.48 శాతంగా నమోదైంది. దేశంలో కరోనాతో ఇప్పటివరకు 4,41,411 మంది మృతి చెందారు.దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు 70.75 కోట్ల మంది వ్యాక్సిన్ వేసుకొన్నారు. నిన్న ఒక్క రోజే 78.47 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకొన్నారు.

click me!