ఇండియాలో పెరిగిన కోవిడ్ కేసులు : గత 24 గంటల్లో 37,593 కరోనా కేసులు

By narsimha lodeFirst Published Aug 25, 2021, 10:56 AM IST
Highlights

ఇండియాలో నమోదౌతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా కేరళలోనే  ఎక్కువగా నమోదౌతున్నాయి. నిన్న ఒక్క రోజే 37,593 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇండియాలో కరోనా కేసులు .3.25 కోట్లకు చేరింది. 

న్యూఢిల్లీ: ఇండియాలో గత 24 గంటల్లో 37,593 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజుతో పోలిస్తే 47.6 శాతం ఎక్కువగా కరోనా కేసులు రికార్డయ్యాయి. అంతకు ముందు రోజు 25,467 కరోనా కేసులు నమోదయ్యాయి.దేశంలో కరోనా కేసుల సంఖ్య 3.25 కోట్లకు చేరింది. దేశంలో నమోదౌతున్న కరోనా కేసుల్లో ఒక్క కేరళలోనే 64 శాతం నమోదౌతున్నట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. నిన్న ఒక్క రోజే కేరళలో 24 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మే 26న 28,798 కరోనా కేసులు రికార్డయ్యాయి.

దేశంలో కరోనా రోగుల మరణాలు 600 దాటింది. నిన్న ఒక్క రోజే 648 మంది మరణించారు. కేరళ రాష్ట్రంలోనే 178 మంది చనిపోయారు. దేశంలో ఇప్పటిరకు కరోనాతో  4,35,758 మంది మరణించారు. గత 24 గంటల్లో కరోనా నుండి 34,169 మంది కోలుకొన్నారు. ఇంతవరకు కరోనా నుండి 3.17 కోట్ల మంది కోలుకొన్నారు. 

దేశంలో ఇప్పటివరకు 59.55 కోట్ల మంది వ్యాక్సిన్ వేసుకొన్నారు. నిన్న ఒక్క రోజే 17,92,755 మంది శాంపిల్స్ ను పరీక్షించారు. దేశంలో ఇప్పటివరకు 51,11,84,547 మంది శాంపిల్స్ ను పరీక్షించారని ఐసీఎంఆర్ తెలిపింది.


 

click me!