ఫుల్లుగా తాగి.. భార్య ముక్కు కొరికేశాడు...!

Published : Jul 12, 2021, 09:42 AM IST
ఫుల్లుగా తాగి.. భార్య ముక్కు కొరికేశాడు...!

సారాంశం

కర్ణాటకలో ఓ శాడిస్ట్ భర్త మద్యం మత్తులో తన భార్య ముక్కు కొరికేశాడు. ఆ తరువాత అక్కడి నుంచి పరారయ్యాడు. 

కర్ణాటకలో దారుణం జరిగింది. మద్యం మత్తు మనిషి విచక్షణ కోల్పోయేలా చేసింది. కట్టుకున్న భార్యను దారుణంగా హింసించడమే కాకుండా.. ఏకంగా ముక్కు కొరికేశాడో కిరాతక భర్త. తనను కాదని పుట్టింటికి వెళ్లిందని ఈ దారుణానికి ఒడి కట్టాడు. 

కర్ణాటకలో ఓ శాడిస్ట్ భర్త మద్యం మత్తులో తన భార్య ముక్కు కొరికేశాడు. ఆ తరువాత అక్కడి నుంచి పరారయ్యాడు. వివరాల్లోకి వెడితే.. ధార్వాడ్ లోని అమ్మినబావి గరామానికి చెందిన ఉమేష్, గీత దంపతుల మధ్య చాలాకాలంగా మనస్ఫర్థలున్నాయి.  దీంతో ఐదేళ్ల క్రితం తన పుట్టింటికి వెళ్లిపోయింది. తాజాగా గీతను తనింటికి తీసుకువచ్చాడు. కానీ అతనిలో మార్పు రాలేదు.. తాగడం, గొడవపడడం, కొట్టడం చేస్తుండడంతో కొద్ది రోజుల క్రితం గీత మళ్లీ తన పుట్టింటికి వెళ్లిపోయింది.

అయితే ఫూటుగా మద్యం తాగి అక్కడికి వెళ్లిన ఉమేష్ తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడు. భార్యతో, ఆమె తల్లితో గొడవకు దిగారు. అతనితో వెళ్లేందుకు గీత నిరాకరించింది. గీత తల్లి కూడా తన కూతుర్ని పంపించేది లేదని తేల్చి చెప్పింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఉమేష్ గీత తల్లి మీద దాడికి పాల్పడ్డాడు.

ఈ క్రమంలోనే అడ్డువచ్చిన గీత ముక్కు కిరాతకంగా  కొరికేశాడు. దీంతో గీత, ఆమె తల్లి పెద్ద పెట్టున కేకలు వేయడంతో స్థానికులు వచ్చారు. అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా..  అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా, తీవ్రంగా గాయపడిన గీతను హుబ్లీలోని కిమ్స్ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. ఈ ఘటనమీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Sabarimala Karthika Deepam: స్వామియే శరణం.. శబరిమల కార్తీక దీపం చూశారా? | Asianet News Telugu
Putin RaGhat Visit:రాజ్ ఘాట్ సందర్శించనున్న పుతిన్.. ఢిల్లీలో భారీగా భద్రత | Asianet News Telugu