ఇండియాలో 31,222 కొత్త కేసులు: కేరళలో తగ్గుముఖం పట్టిన కేసులు

By narsimha lodeFirst Published Sep 7, 2021, 10:10 AM IST
Highlights

ఇండియాలో గత 24 గంటల్లో 31,222 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళ రాష్ట్రంలో కరోనా కేసుల  వ్యాప్తి కొనసాగుతోంది. దేశంలో కరోనా యాక్టివ్ కేసులు  3,92,864 గా నమోదయ్యాయి. కేరళ రాష్ట్రంలో నిన్న 19,688 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజు కరోనాతో 135 మంది మరణించారు.

న్యూఢిల్లీ: ఇండియాలో గత 24 గంటల్లో 31,222 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వీక్లీ పాజిటివిటీ రేటు 2.56 శాతంగా నమోదైంది. 74 రోజులుగా వీక్లి పాజిటివిటీ రేటు  3 శాతం లోపుగా రికార్డైంది.  రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 2.05 శాతంగా ఉంది. గత 8 రోజులుగా రోజువారీ పాజిటివిటీ రేటు 3 శాతంగా రికార్డైంది. 

దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 1.19 శాతంగా రికార్డయ్యాయి. దేశంలో కరోనా యాక్టివ్ కేసులు  3,92,864 గా నమోదయ్యాయి. కరోనా రోగుల రికవరీ రేటు 97.48 శాతంగా ఉంది.   గత 24 గంటల్లో  42,942 కరోనా రోగులు రికవరీ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు 3,22,24,937 మంది కరోనా నుండి కోలుకొన్నారు. గత 24 గంటల్లో కరోనాతో 290 మరణించారు. దీంతో కరోనాతో మరణించిన రోగుల సంఖ్య 4,41,042కి చేరుకొంది.కేరళ రాష్ట్రంలో నిన్న 19,688 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజు కరోనాతో 135 మంది మరణించారు.

click me!