13 యేళ్ల బాలిక కిడ్నాప్, సామూహిక అత్యాచారం.. ఆటో డ్రైవర్ ఘాతుకం.. !

By AN TeluguFirst Published Sep 7, 2021, 8:37 AM IST
Highlights

ఆగష్టు 31 రాత్రి పూణె రైల్వే స్టేషన్‌లో అమ్మాయి తన  స్నేహితుడి కోసం ఎదురుచూస్తుంది. ఈ విషయాన్ని ఒక ఆటో రిక్షా డ్రైవర్ గమనించాడు. ఎంతసేపటికీ ఫ్రెండ్ రాకపోడంతో.. ఆటో డ్రైవర్ రాత్రయిపోతుందని ఇంటి దగ్గర దింపుతానని అన్నాడు. అతని మాటలు నమ్మిన అమ్మాయి అమాయకంగా ఆటో ఎక్కింది. 

ముంబై : మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. పూణేలో ఓ 13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఏడుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధిత  బాలికను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

ఘటన వివరాల్లోకి వెడితే.. ఆగష్టు 31 రాత్రి పూణె రైల్వే స్టేషన్‌లో అమ్మాయి తన  స్నేహితుడి కోసం ఎదురుచూస్తుంది. ఈ విషయాన్ని ఒక ఆటో రిక్షా డ్రైవర్ గమనించాడు. ఎంతసేపటికీ ఫ్రెండ్ రాకపోడంతో.. ఆటో డ్రైవర్ రాత్రయిపోతుందని ఇంటి దగ్గర దింపుతానని అన్నాడు. అతని మాటలు నమ్మిన అమ్మాయి అమాయకంగా ఆటో ఎక్కింది. 

Latest Videos

అయితే, అతను తన స్నేహితులకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పి పిలిచాడు. వారంతా ఆటోలో ఎక్కి పూనెలో నగరంలోని పలు ప్రదేశాల్లో తిప్పుతూ.. అనేక చోట్ల, పలుమార్లు ఆమె మీద సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత ఆమెను ముంబై వెళ్లే బస్సు ఎక్కాలని బలవంతం చేశారు. 

రాత్రయినా కూతురు ఇంటికి రాకపోవడంతో బాలిక తండ్రి వన్‌వాడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశాడు. దీంతో పోలీసులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారని పూణేలోని డిప్యూటీ కమిషనర్ నమ్రత పాటిల్ తెలిపారు.

"మేం ఆమెను పుణెలో కనిపెట్టాం. ఆమె స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన తర్వాత,  నిందితుడిని అరెస్టు చేశాం. ఆమె ఇప్పుడు స్టేబుల్ గా ఉంది" అని అధికారి తెలిపారు. "మిస్సింగ్ కేసు ఫిర్యాదు విచారణలో భాగంగా.. ఆదివారంనాడు బాలికను గుర్తించాం.  తనను అపహరించి, అత్యాచారం చేసినట్లు బాలిక పోలీసులకు చెప్పింది" అని వన్‌వాడి పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ దీపక్ లగాడ్ చెప్పారు.

ఈ కేసులో ప్రమేయం ఉన్న మరికొందరు నిందితుల కోసం కూడా పోలీసులు వెతుకుతున్నారని అధికారులు తెలిపారు.ఇండియన్ పీనల్ కోడ్, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడిందని, తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

click me!